మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
అగళి/ రొళ్ల: ప్రభుత్వ వైద్యకళాశాలలు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప అన్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆదివారం అగళి మండలంలోని 13 పంచాయతీలు, రొళ్ల మండలంలోని 10 పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త ఈరలక్కప్ప మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. ఇందులో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తయి తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. మిగిలినవి అందుబాటులోకి తేవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. మెడికల్ కాలేజీల నిర్వహణ ప్రభుత్వానికి భారమవుతుందని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు పీపీపీ విధానం తీసుకొచ్చిందని మండిపడ్డారు. పేదలు బాగుపడతారంటే చంద్రబాబుకు ఇష్టం ఉండదని విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చడం కోసమే ప్రైవేటు జపం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. పేదలకు వైద్య విద్యతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా చేస్తున్న కుట్రలను కోటి సంతకాల సేకరణతో తిప్పి కొడతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ స్టూడియో శ్రీనివాస్, సర్పంచ్‌లు ముద్దరాజు, రామకృష్ణప్ప, శివకుమార్, మజీ సింగిల్‌విండో అధ్యక్షుడు జయరామప్ప, నాయకులు శివన్న, సదానంద ఆరాధ్య, వేంకటస్వామి, రంగనాథ్, తిమ్మరాయప్ప, సుర్యనారాయణరెడ్డి, కృష్ణ, లింగరాజు, సన్నప్ప, గంగాధర్, శంకరప్ప, ప్రకాష్, కాంతరాజు, హనుమంతరాయప్ప, ఈరన్న, గోవిందప్ప మంజునాథ్, నాగరాజు, మైలారప్ప, గంట నాగరాజు, సురేష్, కాంత, సన్నప్ప, సిద్దలింగ, రమేష్, బాలకృష్ణ, హనుమంతరాయప్ప, లక్ష్మికాంత, హరిష్, లలిత, జగదీష్, రాజన్న, హనుమంతరాయప్ప, మూర్తి, గోవిందప్ప, గిరీష్, మంజునాథ్, నాగేంద్ర, హనుమంతరాజు, గంగాధర్, మల్లికార్జున్, కార్యకర్తలు, పాల్గొన్నారు. రొళ్ల మండలంలో జరిగిన కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు రంగనపల్లి నాగేంద్ర, శివరామప్ప, అలుపననల్లి శ్రీనివాస్, శ్రీనివాస్, మల్లేశప్ప, గోవిందరాజు, బాబు, వజీర్ షేక్, సత్యనారాయణరెడ్డి, సిద్దప్ప, రవికుమార్, హనుమంతరాయుడు, యర్రగుంటప్ప, రాజన్న, నరసింహప్ప, తిమ్మప్ప, చంద్రప్ప, మంజునాథ్, హనుమంతరాయప్ప, చిక్కన్న, తిమ్మరాజు తదితరులు పాల్గొన్నారు.
కోటి సంతకాలతో కూటమి కుట్రలను తిప్పికొడతాం
వైఎస్సార్‌సీపీ మడకశిర నియోజకవర్గసమన్వయకర్త ఈరలక్కప్ప
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం


