
నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగే కార్యక్రమానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయవచ్చని సూచించారు. ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు సమర్పించినా.. పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కలెక్టరేట్‌కు రాకుండా ‘‘me-ek-o-r-a-m.a p.g-o-v.i n’’లో కూడా సమర్పించవచ్చన్నారు.
పోలీస్ కార్యాలయంలో...
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు.
‘పెళ్లి పెటాకులు’ కేసులో నిందితుడికి రిమాండ్
రాప్తాడురూరల్: పెళ్లి పెటాకులు చేసిన కేసులో నిందితుడు కటకటాలపాలయ్యాడు. అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామానికి చెందిన ఓ యువతికి వివాహం నిశ్చమైంది. శనివారం ముహూర్తం, ఆదివారం తలంబ్రాలు పెట్టుకున్నారు. ఇంతలో అదే గ్రామానికి చెందిన వివాహితుడు బాలచంద్ర అంతకు ముందురోజు వరుడుకి ఫోన్ చేసి వధువుతో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉందని, అందుకు సంబంధించిన ఫొటో కూడా పంపుతానని ఇద్దరు ఉన్న ఓ ఫొటోను మొబైల్‌కు పంపాడు. అలాంటి యువతిని పెళ్లి చేసుకుంటాన్నంటే నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేశాడు. దీంతో ఆందోళనకు గురైన వరుడు, అతని కుటుంబ సభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. బాలచంద్ర ఫోన్‌కాల్‌తోనే పెళ్లి చెడిపోయిందని, తనకు ఆయనకు ఏమాత్రం పరిచయం లేదని, కేవలం కక్ష కట్టి తన పెళ్లి చెడగొట్టాడంటూ బాధితురాలు ఇటుకలపల్లి పీఎస్‌లో చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. రెండు రోజుల గాలింపు అనంతరం ఆదివారం బాలచంద్రను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
పుస్తకాభిలాషను
పెంచడమే లక్ష్యం
అనంతపురం కల్చరల్: విద్యార్థులలో పుస్తకాభిలాషను పెంచి.. విజ్ఞాన సముపార్జన దిశగా ప్రోత్సహించడమే లక్ష్యమని గ్రంథాలయ అధికారులు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ‘వియ్ లవ్ రీడింగ్’ కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులకు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీరాములు, విశ్రాంత డీఎస్పీ హరి, డాక్టర్ అంకె రామలింగమయ్య తదితరులు జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా అనే అంశంపై పలు సూచనలు, సలహాలు అందించారు. పిల్లల చేతనే కథలు చెప్పించడం, చదివించి, విశ్లేషణ చేయించడం గ్రంథాలయంలో కొనసాగిస్తామని గ్రంథాలయాధికారులు కమ్మన్న, గోవిందు అన్నారు. కార్యక్రమంలో కేంద్ర గ్రంథాలయ సిబ్బంది ముత్యాలమ్మ, శివమ్మ పాల్గొన్నారు.
బార్‌ను మరిపిస్తున్న బెల్టుషాపు
లేపాక్షి: కోడిపల్లి పంచాయతీ పరిధిలోని నాగేపల్లి–కొత్తపల్లి రోడ్డులో బెల్టుషాపు.. బార్‌ను మరిపిస్తోంది. ఇక్కడ అన్ని రకాల బ్రాండ్‌ల మద్యం అందుబాటులో ఉంది. అనధికారికంగా విక్రయాలు జరుగుతున్నాయి. ఇక అనుబంధంగా ఉన్న రెస్టారెంట్‌లో కోరుకున్న ఫుడ్ సరఫరా చేసేస్తున్నారు. దీంతో ఈ బెల్టుషాపు మందుబాబులతో కళకళలాడుతోంది. మెయిన్ రోడ్డులోనే బెల్టు షాపు నిర్వహిస్తున్నా ఎకై ్సజ్ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.