
కొనసాగుతున్న కార్మికుల ఆందోళన
పుట్టపర్తి టౌన్: సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారానికి తొమ్మిదవ రోజుకు చేరింది. సీఐటీయూ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శనతో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తల్లికి వందనం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చాలని, ఉద్యోగ విరమణ వయస్సు 62కు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, పుట్టపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి నాగార్జున, ట్రెజరర్ గోవిందు, సహాయ కార్యదర్శి పెద్దన్న, రామయ్య, కార్మికులు నరసింహులు, వెంకటేష్, రామాంజనమ్మ, సరోజమ్మ, వెంకటలక్ష్మి, నారాయణమ్మ, మారెప్ప, రమణ, సద్దాం, రామాంజినాయక్, సాయినాథరెడ్డి, గంగాద్రి తదితరులు పాల్గొన్నారు.