
●పోలీసు బండి.. జగమొండి
కళ్యాణదుర్గం: కొన్నేళ్ల క్రితం కళ్యాణదుర్గం అర్బన్ పీఎస్‌కు ఓ బొలెరో వాహనాన్ని అధికారులు కేటాయించారు. స్టేషన్ అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఎస్ఐ పోస్టు లేకపోవడంతో సీఐ స్థాయి అధికారికి ఆ వాహనాన్ని కట్టబెట్టారు. అయితే తరచూ సాంకేతిక సమస్యలతో వాహనం కాస్త మొరాయించడం మొదలు పెట్టింది. దీంతో సోమవారం పెట్రోలింగ్‌కు వెళ్లేందుకు వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు తోయించి స్టార్ట్ చేయించాల్సి వచ్చింది. పోలీసుల అవస్థలను చూసిన ప్రజలు.. చిన్నపాటి మరమ్మతులు సైతం చేయించుకోలేని పోలీసుల తీరుపై ‘ఎంతైనా సావాస దోషం’ అంటూ చలోక్తులు విసిరారు.