
నిరుద్యోగ భృతి ఊసే లేదు
నేను బీఎస్సీ కంప్యూటర్స్ చదివాను. ఉద్యోగం దొరక్క ఇంటి వద్దనే ఉంటున్నా. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, లేకపోతే ఉద్యోగం వచ్చేవరకూ భృతి ఇస్తామని కూటమి నేతలు నమ్మబలికారు. ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు. చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వెంటనే నిరుద్యోగ భృతి అందించాలి.
– హరిప్రసాద్ , నిరుద్యోగి, మడకశిర
బీటెక్ చేసినా.. ఫలితం లేదు
నేను బీటెక్ పూర్తి చేసినా.. ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూస్తున్నా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం దారుణం. దీంతో డిగ్రీలు పూర్తి చేసిన నాలాంటి లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.
– షేక్ మౌలాలి,
మహమ్మదాబాద్, అమడగూరు మండలం

నిరుద్యోగ భృతి ఊసే లేదు