మహిళల భద్రతకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

మహిళల భద్రతకు పెద్దపీట

Mar 18 2025 12:12 AM | Updated on Mar 18 2025 12:11 AM

జిల్లాలో ఆరు ‘శక్తి’ టీంలు ఏర్పాటు

జెండా ఊపి వాహనాలను

ప్రారంభించిన ఎస్పీ రత్న

పుట్టపర్తి టౌన్‌: మహిళల భద్రత కోసం జిల్లాలో ఆరు ‘శక్తి’ టీంలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. సోమవారం ఆమె శక్తి టీంల కోసం ‘మీ రక్షణ– మా కర్తవ్యం’ అనే నినాదాలతో రూపొందించిన వాహనాలను జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..పోలీస్‌ సబ్‌డివిజన్‌కు ఒక టీం చొప్పున జిల్లాలో ఆరు శక్తి టీంలు ఏర్పాటు చేశామన్నారు. టీంలో నోడల్‌ అధికారిగా మహిళా డీఎస్పీ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ నేతృత్వంలో ఇద్దరు మహిళా సిబ్బంది, నలుగురు కానిస్టేబుళ్లు మొత్తం ఆరుగురు సభ్యులు ఉంటారన్నారు. శక్తి టీంలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయన్నారు. మహిళలపై జరుగున్న దాడులు, ఆకతాయిలు వేధింపులు నియంత్రించడంతో పాటు మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలపై అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘శక్తి యాప్‌’ను రూపొందించినట్లు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళలు, బాలికలు 112 లేదా 100 నంబర్‌కు కాల్‌చేస్తే సంఘటనా స్థలానికి వెళ్లి తక్షణ సాయం అందిస్తాయన్నారు. కార్యక్రమంలో మహిళా పీఎస్‌ డీఎస్పీ ఆదినారాయణ, పుట్టపర్తి డీఎస్పీ విజయకుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌, ఆర్‌ఐ మహేష్‌, మహిళా పోలీస్టేషన్‌ సీఐ గోపీనాథ్‌రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాసులు, ఆర్‌ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ప్రదీప్‌సింగ్‌తోపాటు శక్తి టీం సభ్యులు పాల్గొన్నారు.

తాగునీటి కోసం

మహిళల ధర్నా

అగళి: మండలంలోని ముక్కడమపల్లి గ్రామంలో తాగునీటి కోసం ఎస్సీ కాలనీ మహిళలు రోడ్డెక్కారు. రత్నగిరికి వెళ్లే మార్గంపై బైఠాయించి నిరసన తెలపడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. నెల రోజులుగా తాగునీరు రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని ఈ సందర్భంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ నరసింహమూర్తికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీటి కోసం సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.

మహిళల భద్రతకు పెద్దపీట
1
1/1

మహిళల భద్రతకు పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement