చిలమత్తూరు: మండల పరిధిలోని కోడూరు థామస్ మన్రో తోపులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998–99 బ్యాచ్ పదోతరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు పాఠశాల చదువుకునే రోజుల్లో తమకున్న జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు. రోజంతా ఆట పాటలతో సరదాగా గడిపారు.
హిందూపురం టౌన్: స్థానిక శ్రీకంఠపురంలోని ఎస్‌కేయూపీ పాఠశాలలో 1983–84 బ్యాచ్‌కు చెందిన 7వ తరగతి విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 40 ఏళ్ల తరువాత పాఠశాలలో దాదాపు 60 మంది పూర్వ విద్యార్థులు ఒకేచోట కలవడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనాటి ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణరావుతో పాటు పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.