
మాట్లాడుతున్న ఆలూరి సాంబశివారెడ్డి
యల్లనూరు: టీడీపీ హయాంలో ఇచ్చిన పట్టాను ఇప్పుడు సమస్యగా సృష్టించి ఎమ్మెల్యే మీద రుద్దడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరి సాంబశివారెడ్డి అన్నారు. ఆదివారం యల్లనూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యల్లనూరు మండలం 85 నిట్టూరు గ్రామంలో జగనన్న భూహక్కు పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగ్యమ్మ, మరియమ్మ ప్రస్తావించిన భూ సమస్యతో అసలు సంబంధం లేదన్నారు. గత ప్రభుత్వంలో అందజేశారని, అనుమానం ఉంటే రెవెన్యూ రికార్డులు పరిశీలించుకోవాలని హితవు పలికారు. ఈ సమస్యను ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దృష్టికి తీసుకెళ్లామని, ఆమె తక్షణమే స్పందించి రికార్డులు పరిశీలించాలని తహసీల్దారు సుమతిని ఆదేశించారని తెలిపారు. అర్హులైన వారికే పట్టా దక్కుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఈ అంశానికి కులం రంగు అద్ది గ్రామాల్లో కక్షలు రేకెత్తించేలా కథనాలు ప్రచురించే ధోరణికి ఇప్పటికై నా పచ్చ పత్రికలు స్వస్తి పలకాలన్నారు. ఎమ్మెల్యే పద్మావతికి సాయం చేయడం తప్ప.. అన్యాయం చేయడం రాదన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఎక్కువ మంది దళితులే లబ్ధి పొందారన్నారు. ఎవరి భూములను లాక్కోలేదనే విషయాన్ని గుర్తించి పిచ్చి రాతలు ప్రచురించడం మానుకోవాలని, లేకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని పచ్చమీడియాను హెచ్చరించారు.
ఎవరి భూములూ లాక్కోలేదు
ప్రభుత్వ విద్య సలహాదారు
ఆలూరి సాంబశివారెడ్డి