
పోస్టర్లు ఆవిష్కరిస్తున్న డీవీఈఓ రఘునాథ రెడ్డి, ప్రిన్సిపాళ్లు
హిందూపురం అర్బన్: హిందూపురంలో ఆదివారం వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ కంజాక్షన్ తెలిపారు. ఆరుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 35 మంది ఎస్‌ఐలు, 35 మంది హెడ్ కానిస్టేబుళ్లు, మొత్తం 500 మంది పోలీసులు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని సూచించారు. మద్యం దుకాణాలు మూసివేయిస్తున్నామని, రాత్రిలోపు నిమజ్జనం పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటున్నట్లు వివరించారు. నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోకి భారీ వాహనాలు అనుమతించడం లేదని స్పష్టం చేశారు. పరిగి వైపు నుంచి వచ్చే వాహనాలు శిరమీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే, కొట్నూరు నుంచి వచ్చే వాహనాలు పాలసముద్రం వైపు, లేపాక్షి వైపు నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి మీదుగా ప్రయాణించాలని సూచించారు.హిందూపురం లో లోడింగ్, అన్‌లోడింగ్ ఉంటే సోమవారం ఉదయం అనుమతిస్తామనిని, వ్యాపారులు సహకరించాలన్నారు. కాగా, శనివారం సీఐలు వి.శ్రీనివాసులు, వై. శ్రీనివాసులు, వేణుగోపాల్‌లు పట్టణంలో కలయతిరిగి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు నిబంధనలు తెలియజేశారు.
ఇంటర్ ఫెయిలైనా
తరగతులకు రండి
పెనుకొండ: ఇంటర్‌లో ఫెయిలైనా కళాశాలల్లో తరగతులకు హాజరుకావాలని డీవీఈఓ రఘునాథరెడ్డి విద్యార్థులకు సూచించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను పట్టణంలో శనివారం ఆయన పలువురు ప్రిన్సిపాళ్లతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీవీఈఓ మాట్లాడుతూ ఫీజు చెల్లించి ఫెయిల్ లేకుండా పరీక్ష రాయడానికి అక్టోబర్ 3 వరకూ గడువు విధించినట్లు తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులుగా తరగతులకు వెళ్లవచ్చన్నారు. ప్రైవేటు, మేనేజ్‌మెంట్ కళాశాలల విద్యార్థులకు సైతం వర్తిస్తుందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
