
కళకళలాడుతున్న చిత్రావతి నది
పుట్టపర్తి అర్బన్: ఈ ఏడాదిలోనే అత్యధిక వర్షం కురిసింది. రైతన్న మోములో ఆనందం నింపింది. శుక్రవారం అర్ధరాత్రి 12.30 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకూ ఏకధాటిగా వాన కురుస్తూనే ఉంది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. సుమారు 5 గంటలు కురిసిన వర్షంతో చిత్రావతి నది జలకళ సంతరించుకుంది. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగాయి. చెక్‌డ్యాంలు, కుంటలు నిండాయి. సాగులో ఉన్న పంటలకు వర్షం చాలా ఉపయోగకరమని పలువురు రైతులు తెలిపారు.
గోరంట్లలో అత్యధికం..
జిల్లాలోని 22 మండలాల్లో వర్షం కురిసింది. గోరంట్ల మండలంలో అత్యధికంగా 145.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే, బుక్కపట్నం మండలంలో 124.4 మి.మీ, ముదిగుబ్బ మండలంలో 102.6 మిల్లీ మీటర్ల వర్షం పడింది. ఇక.. సోమందేపల్లిలో 95.8, పుట్టపర్తి– 94.6, కొత్తచెరువు– 90.8, నల్లమాడ– 55.8, తాడిమర్రి– 39.2, తలుపుల–35.4, చిలమత్తూరు–33.8, అమడగూరు –25.8, పెనుకొండ– 25.2, కదిరి– 21, సీకేపల్లి– 10.4, ఓడీచెరువు– 9.4, రొద్దం–9, బత్తలపల్లి, రామగిరి మండలాల్లో 6.4, కనగానపల్లి, ధర్మవరం, నల్లచెరువు– 5.4, తనకల్లు–2.4 మి.మీ వర్షపాతం నమోదైంది.
పొంగిన వాగులు.వంకలు
చిత్రావతికి జలకళ
తడిసిముద్దైన ‘గోరంట్ల’

బీడుపల్లి వంకలో జల ప్రవాహం

బత్తలపల్లి చెరువు కాలువలో పారుతున్న నీరు

గువ్వలగుట్టపల్లి చెరువు సప్లై చానల్‌లో..