ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

డీకేడబ్ల్యూ పరీక్ష కేంద్రం వద్ద కోలాహలం

హాల్‌ టికెట్‌ నంబర్లను చూసుకుంటూ..

ఎంబీబీఎస్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్‌ను ఆదివారం ప్రశాంతంగా నిర్వహించారు. నగరంలోని తొమ్మిది,

గూడూరులోని మూడు కేంద్రాల్లో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.15 వరకు పరీక్షను జరిపారు. నగరంలో 3005 మందికి గానూ 2758 మంది.. గూడూరులో 499 మందికి గానూ 437 మంది హాజరయ్యారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలను కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పరిశీలించారు. విద్యార్థులను మెటల్‌ డిటెక్టర్‌తో తనిఖీలు నిర్వహించారు. కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. – నెల్లూరు (టౌన్‌)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement