టెట్‌ నుంచి మినహాయించకుంటే ఉద్యమమే | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నుంచి మినహాయించకుంటే ఉద్యమమే

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

కోట: ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయించాలని, లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని బీటీఏ రాష్ట్ర కోశాధికారి ఎమ్మార్‌ చక్రవర్తి హెచ్చరించారు. కోట క్రాస్‌రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో బీటీఏ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా చక్రవర్తి హాజరై, సభ్యత్వ నమోదు, సంఘ నిర్మాణం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయులపై పనిఒత్తిడి పెంచేస్తున్నారని, రెండేళ్లలో ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీకి పరిష్కారం చూపలేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డేగ సుబ్రహ్మణ్యం, నాగరాజు, పీవీ కిష్టయ్య, శేఖర్‌, రమణయ్య, సుదర్శనమ్మ, చెంగమ్మ, సుజాత పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement