ఇందుకూరుపేట: ప్రముఖ పుణ్యక్షేత్రమైన గంగపట్నంలోని చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏడాది లాగే సంప్రదాయాలను పాటిస్తూ ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూలంగి సేవ జరిపారు. ఆలయ అర్చకుడు అనిల్‌స్వామి, రామకృష్ణస్వామి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, సోదరుడు శ్రీధర్‌రెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆయయ కమిటీ, అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.


