21 నుంచి పల్స్‌పోలియో
నెల్లూరు(అర్బన్): ఈనెల 21 నుంచి జిల్లాలో పల్స్‌పోలియో కార్యక్రమం జరుగుతుందని డీఎంహెచ్‌ఓ సుజాత తెలిపారు. గురువారం నెల్లూరులోని కార్యాలయంలో వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 5 ఏళ్లలోపు వయసున్న 2,94,604 మంది పిల్లల్ని గుర్తించామన్నారు. వారికి 2,396 బూత్‌ల ద్వారా చుక్కల మందును వేస్తామన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి డాక్టర్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ 403 హైరిస్క్ ప్రాంతాల్లో 82 మొబైల్ బూత్‌ల ద్వారా బ స్టాండ్, రైల్వేస్టేషన్, రద్దీ ఉన్న ప్రాంతాల్లో పోలియో చుక్కలు మందు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. విజయవంతం చేయాలని తల్లిదండ్రులను కో రారు. కార్యక్రమంలో జిల్లా టీబీ, ఎయిడ్స్, లెప్రసీ నివారణ అధికారి డా క్టర్ ఖాదర్‌వలీ, కావలి డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.బ్రిజిత, డీఎంఓ హుస్సేనమ్మ, డీపీ ఎంఓ డా.సునీల్‌కుమార్, డాక్టర్ యశ్వంత్, డాక్టర్ సు రేంద్ర, డాక్టర్ అమరేంద్రనాథ్‌రెడ్డి, ఎస్‌ఓ సహన, డి ప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్ పాల్గొన్నారు.


