మానవత్వం చాటుకున్న కాకాణి పూజిత
పొదలకూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. ఆమె గురువారం మండలంలోని కల్యాణపురం గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నెల్లూరు నుంచి వెళ్తున్నారు. మట్టెంపాడు వద్ద ముందు వెళ్లే మోటార్‌బైక్‌ను వెనుక వైపు నుంచి మరో బైక్ ఢీకొంది. దీంతో మండలంలోని డేగపూడి గ్రామానికి చెందిన యువకులు గాయపడ్డారు. అదేమార్గంలో వస్తున్న పూజిత వెంటనే కారు ఆపి అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అది రావడం ఆల స్యం అవుతుందని తన కారులో ఎక్కించుకుని వైద్యసేవల నిమిత్తం బయలుదేరారు. అంబులెన్స్ ఎదురుపడగా అందులో క్షతగాత్రులను ఎక్కించి పంపారు. దీంతో సకాలంలో యువకులకు వైద్యసేవలందాయి. పూజిత వెంట వాకాటి శ్రీనివాసులురెడ్డి, అంజాద్ తదితరులు ఉండి బాధితులకు సహాయపడ్డారు.


