యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి
● వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు
వెంకటాచలం: యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో మంగళవారం ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, నోవా బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వరంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో వీఎస్‌యూ కళాశాల, అనుబంధ రావూస్, ఆదిత్య, కృష్ణచైతన్య, డీఆర్‌డబ్ల్యూ కళాశాలల విద్యార్థులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడటాన్ని మించిన పుణ్యకార్యం మరొకటి లేదన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, ఎన్‌ఎస్‌ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ ఉదయ్‌శంకర్, ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ బీవీ సుబ్బారెడ్డి, నాగభూషణరావు తదితరులు పాల్గొన్నారు.


