యూటీఎఫ్ నూతన కమిటీ ఏర్పాటు
నెల్లూరు(టౌన్): యూటీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని కార్యాలయంలో సోమవారం జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడిగా అచ్చయ్య, అధ్యక్షుడిగా వీరి శేషులు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఖాజావలీ, అఽసోసియేట్ అధ్యక్షురాలిగా సుభాషిణి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా చలపతిశర్మ, కోశాధికారిగా మురళీధరరావుతోపాటు 14 మంది జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏడుగురు రాష్ట్ర కౌన్సిలర్లు, ఏడుగురు ఆడిట్ కమిటీ సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. అనంతరం యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి, ప్రస్తుత రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విధానాలు మార్పు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. 12వ పీఆర్సీని ప్రకటించడంతోపాటు 30 శాతం ఐఆర్‌ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.


