ట్రావెల్స్ బస్సుల్లో విస్తృత తనిఖీలు
● 33 కేసుల నమోదు, 8 బస్సుల సీజ్
నెల్లూరు (టౌన్): కర్నూలు ఘటన, ట్రావెల్స్ బస్సులపై ‘సాక్షి’లో మృత్యుశకటాలు శీర్షికన ప్రచురితమైన కథనం నేపథ్యంలో జిల్లా రవాణాశాఖాధికారులు శనివారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రవాణాశాఖ డీటీసీ బి.చందర్ ఆదేశాలతో నగరంలోని మినీబైపాస్, అయ్యప్పగుడి సమీపంలోని జాతీయ రహదారిపై రవాణాశాఖాధికారులు బృందాలుగా ఏర్పడి ట్రావెల్స్ బస్సుల్లో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి నిబంధనలు పాటించని 33 బస్సులపై కేసులు నమోదు చేశా రు. దాదాపు రూ.6 లక్షల మేర అపరాధ రుసుం విధించారు. వీటిల్లో 8 బస్సులను సీజ్ చేశారు. బస్సుల్లో రెండు ఎమర్జెన్సీ డోర్‌కు ముందు సీటు లేదా బెర్త్ ఏర్పాటుపై 11 కేసులు, బస్సు మెయిన్ క్యాబిన్‌లో బెర్త్ ఏర్పాటుపై 22 కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై వరుస తనిఖీలు ఉంటాయ ని డీటీసీ చందర్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆర్టీఓ మదాని, ఎంవీఐలు బాలమురళీకృష్ణ, గోపినాయక్, రఫీ, అనిల్, ఏఎంవీఐలు పూర్ణచంద్రరా వు, స్వప్నిల్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
వీరి చలపతికి వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శ
కొడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం రూరల్): టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులో జైలుకెళ్లి బెయిల్‌పై విడుదలైన మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావును మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఫోన్‌లో పరామర్శించారు. నెలరోజులకు పైగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న చలపతిరావు రెండు రోజుల క్రితం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్ చేిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ కేసులకు భయపడొద్దని ధైర్యం చెప్పారు. చలపతిరావు మాట్లాడుతూ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తమకు అండగా ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ పటిష్టతకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు.
శ్రీవారి దర్శనానికి
12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,110 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 25,695 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైన్‌లోకి వెళ్లాలని టీటీడీ స్పష్టం చేసింది.
సకాలంలో అనుమతులు
నెల్లూరురూరల్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్లో తిక్కన ప్రాంగణంలో పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మా ట్లాడారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మౌ లిక వసతులను కల్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి వసతి, విద్యుత్, కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు. పరిశ్రమలశాఖ జీఎం మారుతీప్రసాద్ మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 4,912 దరఖాస్తులు రాగా, 4,778 దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జెడ్‌ఎం శివకుమార్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్‌కుమార్, ఇరిగేషన్ ఎస్‌ఈ దేశ్‌నాయక్, డీటీసీ చందర్, పలు పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు.
ట్రావెల్స్ బస్సుల్లో విస్తృత తనిఖీలు
ట్రావెల్స్ బస్సుల్లో విస్తృత తనిఖీలు


