ఇదే మొదటి.. చివరి విహారయాత్ర
అయితే తన మిత్రుడు, సమీస బంధువు, తనతో కలిసి పనిచేసే నేలకుర్తి రమేష్ ఆహ్వానం మేరకు మూడు రోజుల పాటు సరదాగా విహరించేందుకు హైదరాబాద్‌కు భార్య, బిడ్డలతో కలిసి గోళ్ల రమేష్ వెళ్లాడు. ఈ విషయం స్వగ్రామంలోని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. చైన్నెలో ఉన్నంటున్న చిన్న అక్క కొడుకు (మరో మేనల్లుడు) కూడా నేరుగా హైదరాబాద్‌కు చేరుకుని వారితో సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో వారిని బెంగళూరు బస్సు ఎక్కించి తాను చైన్నె బయలు దేరాడు. ఇంటికి చేరక ముందే ఈ విషాదం తెలియడంతో షాక్‌కు గురయ్యాడు. తన కుటుంబంతో కలిసి విహారయత్రకు వెళ్లడం ఇదే మొదటి .. చివరి విహార యాత్ర.. విషాదయాత్రగా మారింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన నేలకుర్తి రమేష్ కుటుంబం స్వగ్రామం దుత్తలూరు మండలం కొత్తపేటకు చేరుకుంది. వారిని చూసిన క్షణం.. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు.


