కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
ఘనంగా నాగులచవితి
నాగులచవితి పర్వదినాన్ని జిల్లాలో శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పుట్టలో పాలుపోసి మొక్కులను చెల్లించుకున్నారు. నగరంలోని పొర్లుకట్టలో గల నాగళ్ల పరమేశ్వరి దేవస్థానంలో విశేష పూజలు చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
పెన్నమ్మ పరవళ్లు
సంగం: సంగం బ్యారేజీ వద్ద పెన్నమ్మ పరవళ్లు తొక్కుతోంది. సోమశిల నుంచి వచ్చే వరద, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు బీరాపేరు, బొగ్గేరు వాగులతో కలిపి 1.03 లక్షల క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తోంది. పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. బీరాపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పెరమనకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చెన్నవరప్పాడు గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
● ఎస్పీ అజిత
నెల్లూరు(క్రైమ్): నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్ల విధులే కీలకమని ఎస్పీ అజిత వేజెండ్ల పేర్కొన్నారు. జిల్లాలోని కోర్టు కానిస్టేబుళ్లు, డీఎస్పీలు, పోలీస్ అధికారులతో సమావేశాన్ని స్థానిక ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించారు. కోర్టు కేసుల విచారణ.. అభియోగ పత్రాల దాఖలు.. సమన్లు.. వారెంట్ల అమలు.. వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలు తదితరాలపై సమీక్షించిన అనంతరం ఆమె మాట్లాడారు. సమయపాలన, నిబద్ధతతో కోర్టు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాలని సూచించారు. కేసులకు సంబంధించిన అభియోగ పత్రాలు, సాక్ష్యాలను కోర్టులో సకాలంలో సమర్పించి శిక్షల శాతాన్ని పెరిగేలా చూడాలని సూచించారు. కేసు పూర్తి వివరాలను సీసీటీఎన్నెస్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఏఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం


