
ప్లాస్టిక్ వినియోగంతో అనర్థాలు
నెల్లూరు(అర్బన్): ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగంతో అనేక అనర్థాలు సంభవిస్తున్నాయని డీఎంహెచ్‌ఓ సుజాత పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయ ఆవరణలో చెత్తాచెదారాలను డాక్టర్లు, ఉద్యోగులతో కలిసి శనివారం తొలగించిన అనంతరం ఆమె మాట్లాడారు. కవర్లకు ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులను వినియోగించాలని కోరారు. అనంతరం స్వచ్ఛాంధ్ర సాధన కోసం కృషి చేస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ, డీపీఎంఓ రమేష్, డీఐఓ ఉమామహేశ్వరి, న్యూక్లియస్ డాక్టర్ సురేంద్ర, డీఎంఓ హుస్సేనమ్మ, డెమో అధికారి కనకరత్నం తదితరులు పాల్గొన్నారు.