
అలా పెట్టారు.. ఇలా తొలగించారు
కొండాపురం(ఉదయగిరి): కొండాపురం మండల కేంద్ర నడిబొడ్డులో అత్యంత విలువైన ప్రభుత్వ వాగు పోరంబోకు భూమి కబ్జాకు గరైంది. ఇలా కొల్లగొట్టిన రెండెకరాల్లో వాణిజ్యావసరాల నిమిత్తం కొంతమేర కట్టడాలను నిర్మించారు. సుమారు రూ.కోటి విలువజేసే ఈ భూమిని కొట్టేయడం వెనుక అఽధికార పార్టీకి చెందిన ఓ యువ నేత ప్రమేయముందనే ఆరోపణలున్నాయి.
ఇదీ తీరు..
కొండాపురం మండలం గానుగుపెంట రెవెన్యూ పరిఽధిలోని కలిగిరి – కొండాపురం రోడ్డు మార్గంలో సర్వే నంబర్ 18 రెవెన్యూ రికార్డుల్లో వాగు పోరంబోకు భూమిగా ఉంది. దీనిపై కన్నేసిన ఓ స్థానికుడు దాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో రెండు నెలల క్రితం చదును చేశారు. చుట్టూ హద్దులను ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం అందులో కట్టడాలను నిర్మించారు. ఇంత జరుగుతున్నా, రెవెన్యూ అధికారులకు మాత్రం కనిపించలేదు. విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి స్థానికులు తెలియజేశారు.
గత్యంతరం లేక..
దీంతో గత్యంతరం లేక తహసీల్దార్ కోటేశ్వరరావు ఆదేశాల మేరకు సదరు భూమిలో బోర్డును రెవెన్యూ అధికారులు శనివారం ఏర్పాటు చేశారు. ఇది ఉదయం జరగ్గా, మధ్యాహ్నంలోపే దీన్ని పీకేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని రెవెన్యూ అధికారి కొండయ్య తెలిపారు.
వాగు పోరంబోకు భూమి కబ్జా
హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన
రెవెన్యూ అధికారులు
గంటల వ్యవధిలో తీసేసిన వైనం

అలా పెట్టారు.. ఇలా తొలగించారు

అలా పెట్టారు.. ఇలా తొలగించారు