ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం

Mar 18 2025 12:08 AM | Updated on Mar 18 2025 12:08 AM

ఇంటర్

ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం

నెల్లూరు (టౌన్‌): నగరంలోని స్టోన్‌హౌస్‌పేటలో ఉన్న కేఏసీ జూనియర్‌ కళాశాలలో సోమవారం నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల జవా బు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. సంస్కృతం, ఇంగ్లిష్‌, తెలుగు, హిందీ, మ్యాథ్‌మ్యాటిక్స్‌, సివిక్స్‌ సబ్జెక్ట్‌ల మూల్యాంకనం చేస్తున్నారు. దాదాపు 480 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారని ఆర్‌ఐఓ ఆదూరు శ్రీనివాసులు తెలిపారు. వచ్చే నెల మొదటి వారానికి మూల్యాంకనం పూర్తి కావచ్చన్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు మిగిలిన సబ్జెక్ట్‌ల మూల్యాంకనం జరుగుతుందన్నారు. తొలివిడతలో జరుగుతున్న మూల్యాంకనానికి హాజరుకాని అధ్యాపకులు మూల్యాంకనం కేంద్రంలో రిపోర్ట్‌ చేయాలన్నారు. గైర్హాజరైన అధ్యాపకులు, సంబంధిత కళాశాలల యాజమాన్యాలపైన ఇంటర్‌ బోర్డు నిబంధనల మేరకు చర్యలు ఉంటాయన్నారు.

యోగి వేమన వర్సిటీ

ఇన్‌చార్జి వీసీగా అల్లం

వెంకటాచలం: వైఎస్సార్‌ జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వీసీగా విక్రమసింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌ ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

వీఆర్‌కు ఏఆర్‌ ఏఎస్పీ

నెల్లూరు (క్రైమ్‌): ఏఆర్‌ ఏఎస్పీ జి. మునిరాజాను వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిరాజా గతేడాది అక్టోబర్‌లో ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కొంత కాలంగా విధుల్లో నిర్లక్ష్యం, వివిధ ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను వీఆర్‌కు బదిలీ చేశారు. దీంతో ఆయన విధుల నుంచి రిలీవ్‌ అయి పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేసేందుకు వెళ్లారు.

ధాన్యం కొనుగోళ్లు

మరింత వేగవంతం

రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 85208 79979 ఏర్పాటు

జేసీ కార్తీక్‌

నెల్లూరు (అర్బన్‌): ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగంగా జరపనున్నామని జేసీ కార్తీక్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 300 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి ఒకటి, రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 11 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. జిల్లాలో 3.50 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. 250 లారీలను కొనుగోలు కేంద్రాలకు పంపేందుకు సిద్ధం చేశామన్నారు. లారీలు జిల్లా దాటి వెళ్లకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి రోజు 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు. మద్దతు ధరకన్నా తక్కువకు కొనుగోలు చేసే రెండు మిల్లులపై కూ డా కేసులు నమోదు చేశామన్నారు. రైతులు విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను సంప్రదించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులుంటే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నంబర్‌ 85208 79979 నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం 
1
1/2

ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం

ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం 
2
2/2

ఇంటర్‌ మూల్యాంకనం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement