
అందుబాటులో హాల్ టికెట్లు
నెల్లూరు (టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి అభ్యాసకుల హాల్‌టికెట్లు సంబంధిత స్టడీ సెంటర్లలో అందుబాటులో ఉన్నట్లు డీఈ ఓ ఆర్.బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. హాల్ టికెట్లను వాట్సాప్–మనమిత్ర ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
కనువిందు చేసిన
నృత్య ప్రదర్శన
నెల్లూరు (బృందావనం): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నగరపాలక సంస్థ, జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలలకు చెందిన 1,116 మంది విద్యార్థులు నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక నృత్య ప్రదర్శన నిర్వహించారు. ‘మొక్కజొన్న తోటలో’ జానపద గేయానికి అనుగుణంగా సాగిన నృత్య ప్రదర్శన ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఈ కార్యక్రమానికి వండర్‌బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు, భారత్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు తదితర సంస్థల ప్రతినిధులు హాజరై వీక్షించారు. విద్యార్థులు, నిర్వాహకులకు ఆయా సంస్థల ప్రతినిధులు సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పలువురు పాల్గొన్నారు.