
బాలల హక్కులు కాపాడాలి : డీఎంహెచ్‌ఓ
నెల్లూరు(వేదాయపాళెం): బాలలకు కల్పించిన హక్కులను కాపాడాలని డీఎంహెచ్‌ఓ పెంచలయ్య అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలల సంరక్షణ విభాగం, జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ బాలబాలికలు బడిలో మాత్రమే ఉండాలన్నారు. వారిని బాగా చదివించాలన్నారు. అప్పుడే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి సురేష్ మాట్లాడుతూ పేదరికం, నిరక్షరాస్యత వల్ల పలువురు తమ చిన్నారులను పనులకు పంపిస్తున్నారన్నారు. శ్రమ దోపిడీకి గురవుతున్నారని తెలిపారు. బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరంగా తీసుకునే చర్యలు, శిక్షలు వివరించారు. కార్యక్రమంలో డీసీఎల్ వెంకటేశ్వర్లు, దిశ పోలీస్ విభాగం నుంచి సతీష్, చైల్డ్ లేబర్ విభాగం సిబ్బంది హరిబాబు, శ్రీనివాసులు, రామారావు, సీడబ్ల్యూసీ సభ్యుడు శ్రీనివాసరావు, సీజేడబ్ల్యూఎస్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సమగ్ర బాలల సంరక్షణ సిబ్బంది, దుర్గా నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment