కోహ్లికి నో ఛాన్స్‌! మరో టీమిండియా స్టార్‌కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్‌: బట్లర్‌ | ICC ODI WC 2023: Jos Buttler Ignores Virat Kohli, Picks Rohit Sharma In His First 5 Players In ODI Dream XI - Sakshi
Sakshi News home page

ICC ODI WC 2023: కోహ్లికి నో ఛాన్స్‌! మరో టీమిండియా స్టార్‌కు చోటు.. ఆ ఐదుగురు అదుర్స్‌: బట్లర్‌

Oct 2 2023 11:35 AM | Updated on Oct 3 2023 7:57 PM

WC 2023: Buttler Picks Rohit Snubs Kohli in His First 5 Players ODI Dream XI - Sakshi

జోస్‌ బట్లర్‌ (PC: Jos Buttler X)

ICC ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌. ఇయాన్‌ మోర్గాన్‌ సారథ్యంలో 2019లో మొట్టమొదటిసారిగా జగజ్జేతగా నిలిచిన ఇంగ్లిష్‌ జట్టు పగ్గాలు ఇప్పుడు స్టార్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ చేతిలో ఉన్న విషయం తెలిసిందే.

అన్ని విభాగాల్లో పటిష్టంగా బట్లర్‌ బృందం
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆటగాడిగా రాణిస్తూ.. కెప్టెన్‌గానూ అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాడు ఈ వికెట్‌ కీపర్‌. గతేడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని గెలిచిన రికార్డు బట్లర్‌ సొంతం. 

కోహ్లికి నో ఛాన్స్‌
ఈ నేపథ్యంలో అన్ని విభాగాల్లో వన్డే ప్రపంచకప్‌లోనూ ఇంగ్లండ్‌ పటిష్టంగా ఉండటంతో మోర్గాన్‌ వారసత్వాన్ని బట్లర్‌ నిలబెట్టే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. మెగా టోర్నీ ఆరంభానికి ముందు ఈ రైట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ తన డ్రీమ్‌ ఎలెవన్‌ వన్డే టీమ్‌లో మొదటి ఛాయిస్‌గా ఐదుగురు ప్లేయర్లను ఎంపిక చేసుకున్నాడు.

అనూహ్యంగా ఇందులో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లికి మాత్రం బట్లర్‌ చోటివ్వలేదు. అయితే, మరో భారత స్టార్‌ను మాత్రం తన జట్టుకు ఎంపిక చేశాడు. ఇంతకీ ఆ ఐదుగురు ఎవరంటే?

1.ఆదిల్‌ రషీద్‌
ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ ఇప్పటి వరకు అంతర్జాతీయ వన్డేల్లో 5.67 ఎకానమీతో 184 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌కప్‌ టోర్నీలో 11 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. గత 10 వన్డేల్లో రషీద్‌ ఏకంగా 22 వికెట్లు తీయడం విశేషం. ఈ నేపథ్యంలో బట్లర్‌ తన మొదటి ఎంపికగా ఆదిల్‌ పేరు చెప్పాడు.

2.క్వింటన్‌ డికాక్‌
సౌతాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్‌ డికాక్‌ వన్డేల్లో 95.75 స్ట్రైక్‌రేటుతో 6176 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌ ఈవెంట్లో 450 రన్స్‌ తీశాడు. అదే విధంగా అతడి ఖాతాలో 190 క్యాచ్‌లు, 16 స్టంపింగ్‌లు ఉన్నాయి. కాగా తాజా వరల్డ్‌కప్‌ తర్వాత తాను వన్డేలకు గుడ్‌బై చెప్పనున్నట్లు డికాక్‌ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

3.రోహిత్‌ శర్మ
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డేల్లో ఇప్పటి వరకు 10112 పరుగులు సాధించాడు. వరల్డ్‌కప్‌ టోర్నీలో 978 పరుగులు తీశాడు. 2011లో ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్‌.. ఈసారి సొంతగడ్డపై ఏకంగా కెప్టెన్‌ హోదాలో బరిలోకి దిగనుండటం విశేషం.

4.గ్లెన్‌ మాక్స్‌వెల్‌
ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఖాతాలో 3495 వన్డే పరుగులు, 64 వికెట్లు ఉన్నాయి. బ్యాట్‌, బాల్‌ రెండింటితోనూ రాణించగల సత్తా ఉన్న ఈ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ ఆసీస్‌కు ప్రధాన బలం కానున్నాడు. భారత్‌లోని స్లో పిచ్‌లపై ఈసారి ఆఫ్‌ స్పిన్నర్‌ మాక్సీ ప్రభావం చూపే అవకాశం ఉంది.

5. అన్రిచ్‌ నోర్జే
సౌతాఫ్రికా పేసర్‌ అన్రిచ్‌ నోర్జే వన్డేల్లో ఇప్పటి వరకు 36 వికెట్లు తీశాడు. 29 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్‌ గాయం కారణంగా వన్డే వరల్డ్‌కప్‌-2023టోర్నీకి దూరమయ్యాడు. 2019లోనూ చేతినొప్పి కారణంగా ఐసీసీ ఈవెంట్‌ ఆడే అవకాశం కోల్పోయాడు.

చదవండి: WC 2023: మునుపటిలా లేదు.. కానీ ఆ జట్టు సెమీస్‌ చేరితే ఆపడం కష్టం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement