Virat Kohli Shares Pic With a Cool Cat in Practice Session in Mumbai - Sakshi
Sakshi News home page

Virat Kohli- Anushka Sharma: కోహ్లి షేర్‌ చేసిన ఫొటోపై అనుష్క కామెంట్‌.. కొంటె అబ్బాయి.. వైరల్‌!

Nov 23 2021 12:08 PM | Updated on Nov 23 2021 1:08 PM

Virat Kohli Shares Pic With Cat in Practice Anushka Sharma Comment Goes Viral - Sakshi

పిల్లి ఫొటో షేర్‌ చేసిన కోహ్లి.. అనుష్క కామెంట్‌ వైరల్‌

Virat Kohli Shares Pic With Cat in Practice Anushka Sharma Comment Goes Viral: టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్‌, కుటుంబానికి సంబంధించిన అప్‌డేట్లు పంచుకుంటూ అతడు చేసే​ పోస్టులు అభిమానులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో... తాజాగా కోహ్లి షేర్‌ చేసిన ఫొటోలు, అందుకు అతడి సతీమణి, హీరోయిన్‌ అనుష్క శర్మ స్పందించిన విధానం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

కాగా టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో పేలవ ప్రదర్శన తర్వాత ఇంటిబాట పట్టిన టీమిండియా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌ ఆడిన సంగతి తెలిసిందే. హిట్‌మాన్‌ రోహిత్‌ శర్మ పూర్తిస్థాయిలో పొట్టి ఫార్మాట్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత 3-0 తేడాతో కివీస్‌ను వైట్‌వాష్‌ చేసి సత్తా చాటింది. అయితే, ఈ సిరీస్‌ నేపథ్యంలో కోహ్లికి బీసీసీఐ విశ్రాంతినివ్వగా రెండో టెస్టు నుంచి అతడు అందుబాటులోకి రానున్నాడు.

ఈ క్రమంలో కాసేపు ప్రాక్టీసు​ చేసిన కోహ్లి... తన వద్దకు వచ్చిన పిల్లిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడు. ‘‘ప్రాక్టీసులో కూల్‌ కాట్‌.. మీకు హెలో చెబుతోంది’’ అంటూ వీటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇందుకు బదులుగా అనుష్క... ‘‘హెలో బిల్లీ’’ అంటూ కామెంట్‌ చేసింది. ఇక కోహ్లి సైతం.. ‘‘ఢిల్లీ నుంచి వచ్చిన కొంటె అబ్బాయి.. ముంబైలో ఉండే పిల్లి(అనుష్కను ఉద్దేశించి)’’ అంటూ చమత్కరించాడు. ఇక నవంబరు 25 నుంచి ఇండియా- కివీస్‌ టెస్టు సిరీస్‌ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

చదవండి: Lendl Simmons T20 XI: ఒకే జట్టులో ధోని, కోహ్లి.. కెప్టెన్‌గా ఎవరంటే..?
Ravichandran Ashwin: నాతో పాటు అతడిని కూడా ఢిల్లీ ఫ్రాంఛైజీ రీటైన్‌ చేసుకోదు.. ఎందుకంటే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement