Venkatesh Prasad: 'మేం కాదు మీరే..' పాక్‌ మాజీ కెప్టెన్‌కు దిమ్మతిరిగే కౌంటర్‌

Venkatesh Prasad Roasts Javed Miandad-CRYPTIC Post Pakistan-Is-Hell - Sakshi

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌కు టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఏసీసీ) ఆసియాకప్‌ వేదికను మార్చడంలో బీసీసీఐ కీలకపాత్ర పోషించిదంటూ అసహనం వెళ్లగక్కిన మియాందాద్‌.. పాక్‌లో ఆడడానికి నిరాకరిస్తున్న టీమిండియాను ''గోటూ..హెల్‌(Go to Hell)'' అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నాడు. క్రికెట్‌లో పెద్దన్నలా వ్యవహరించాల్సిన ఐసీసీ.. బీసీసీఐకి తొత్తుల మారిందన్నాడు. బీసీసీఐ చెప్పినట్లు ఆడితే ఐసీసీ ఉండి ప్రయోజనం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు.

మియాందాద్‌ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న వెంకటేశ్‌ ప్రసాద్‌  ట్విటర్‌ వేదికగా భగ్గుమన్నాడు.'' పాకిస్తాన్‌తో ఆడకపోవడం వల్ల టీమిండియాకు ఒరిగేదేం ఉండదు. ఎటొచ్చి మనతో వాళ్లు ఆడకపోతే వాళ్లే తీవ్రంగా నష్టపోవడం ఖాయం. ఈ విషయం తెలుసుకుంటే బెటర్‌. మీ వ్యాఖ్యలతో పాక్‌ క్రికెట్‌ను మరింత ఊబిలోకి నెట్టేస్తున్నారు. నరకానికి వెళ్లేది మేం కాదు మీరే.. సిద్దంగా ఉండండి.

ప్రపంచ క్రికెట్‌ను బీసీసీఐ శాసిస్తుందని నిరాధార ఆరోపణలు చేయడం తగదు. మీ వైఖరిని మార్చుకోండి. ప్రస్తుతం మీ దేశంలో శాంతి భద్రతలు సరిగా లేవు.. సెక్యూరిటీ కారణంగానే టీమిండియా ఆడేందుకు నిరాకరించింది. ఇదే విషయాన్ని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా పేర్కొన్నారు. తటస్థ వేదికపై ఆడేందుకు భారత్‌ అంగీకరించినట్లు గుర్తించడం మానేసి ఇలా పనికిమాలిన ఆరోపణలు చేయడం సరికాదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చదవండి: టర్కీ భూకంపం.. శిథిలాల కింద స్టార్‌ ఫుట్‌బాలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top