మీమ్స్‌తో అభిమానాన్ని చాటుకున్న ఫ్యాన్స్‌

Twitter Reacts With Hashtag  Virushka Memes Goes Viral  - Sakshi

ఢిల్లీ :  ఇప్పుడు మేం ఇద్దరమే.. జనవరి 2021 తర్వాత మేం ముగ్గురం కాబోతున్నామంటూ విరుష్క జంట శుభ‌వార్త చెప్పిన‌ప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌ల వెల్లువ మొద‌లైంది. ట్విటర్‌లో విరాట్‌ తన భార్య అనుష్క శర్మతో లేటెస్ట్‌గా దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. 'ప్రస్తుతం నా భార్య గర్భవతి..త్వరలోనే మా ఇంట్లోకి మూడో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు.. అది అబ్బాయా లేక అమ్మాయా అనే విషయం పక్కనపెడితే.. ఇప్పుడు నేను పుత్రోత్సాహం అనుభవిస్తున్నా.. మా ఆరేళ్ల రిలేషిన్‌షిప్‌లో ది మోస్ట్‌ మొమరబుల్‌ మూమెంట్‌ ఇదే.. మేం త్వ‌ర‌లోనే ముగ్గురం కాబోతున్నాం  అంటూ ట్వీట్ చేసిన ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. (తండ్రి కాబోతున్న విరాట్‌ కోహ్లి)

స్నేహితులు, ప్ర‌ముఖుల‌, అభిమానులు  అంద‌మైన జంట‌కు హార్టీ కంగ్రాట్స్ అంటూ ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేసేస్తున్నారు. ఈ శుభ‌సంద‌ర్భంగా విరాట్ రియ‌క్ష‌న్ ఇలా ఉంటుందంటూ ప‌లువురు మీమ్ మేక‌ర్స్ ఇప్ప‌టికే మీమ్స్  క్రియేట్ చేస్తున్నారు. దీంతో ట్విట్ట‌ర్‌లో విరుష్క మీమ్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇక 2013 నుంచి రిలేషిన్‌షిప్‌లో విరుష్క జోడి.. 2017లో డిసెంబర్‌ 11న ఇటలీలో జరిగిన పెళ్లితో వైవాహిక జీవితం ప్రారంభించారు. అటు క్రీడారంగంలో విరాట్‌కు, ఇటు సినీ రంగంలో అనుష్క‌కు కోట్లాదిమంది అభిమానులున్నారు. ప్ర‌త్యేకించి  విరుష్క జంట‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ‌. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top