Team India: players spend New Years eve watching Pushpa movie - Sakshi
Sakshi News home page

Ind Vs Sa: పుష్ప ట్రాన్స్‌లో టీమిండియా... ట్వీట్‌ వైరల్‌

Jan 1 2022 2:27 PM | Updated on Jan 1 2022 3:21 PM

Team India players spend New Years eve watching Pushpa movie - Sakshi

సెంచూరియాన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్ట్‌కు మూడు రోజులు సమయం ఉండడంతో భారత ఆటగాళ్లు ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప సినిమా ఫీవర్‌ నడుస్తోందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులు ఈ సినిమాను వీక్షించారు. ఈ విషయాన్ని టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారి ట్విటర్‌ ద్వారా వెల్లడించాడు.

"సినిమా చూస్తున్నంతసేపు పుష్పరాజ్‌ ట్రాన్స్‌లో ఉన్నాము. విలక్షణ నటుల్లో ఒకడైన అల్లు అర్జున్, పుష్ప బృందానికి అభినందనలు. పుష్ప 2 కోసం వేచి చూస్తున్నాము" అని విహారి ట్విట్‌ చేశాడు. కాగా జోహన్నెస్‌బర్గ్‌లో న్యూ ఈయర్‌ వేడుకలను ఘనంగా జరపుకున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ప్రియాంక్‌ పాంచల్‌, అశ్విన్‌లు సోషల్‌ మీడియాలో పంచుకోగా వైరల్‌ అవుతున్నాయి.

చదవండి: Team India New Year Celebrations: న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌తో అదరగొట్టిన టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement