మన డెన్‌లోకి వచ్చేస్తున్నా : రైనా | Suresh Raina Eagerly Waiting To Join Chennai Super Kings Camp | Sakshi
Sakshi News home page

సీఎస్‌కేకు ఆడటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: రైనా

Mar 18 2021 4:42 PM | Updated on Mar 18 2021 6:11 PM

Suresh Raina Eagerly Waiting To Join Chennai Super Kings Camp - Sakshi

న్యూఢిల్లీ : ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌కు చెన్నైసూపర్ కింగ్స్ జట్టుతో చేరడం పట్ల సురేష్‌ రైనా సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అతను తన ఆనందాన్ని ట్విట్టర్‌ ద్వారా వ్యక్తపరిచాడు. చెన్నై యాజమాన్యం ‘చిన్న తలా వస్తున్నాడు’ అంటూ బుధవారం రైనా ప్రాక్టీస్ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇందులో రైనా తన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో బంతులను బౌండరీలకు పంపడాన్ని మనం చూడవచ్చు. ఈ వీడియోపై స్పందించిన రైనా  ‘మన అడ్డాలోకి రావడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. ప్రస్తుతం జట్టులో రైనా చేరికతో తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలపడిందని, గతేడాది ప్రదర్శన పునరావృతం కాదని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోంది. మరో పక్క చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐపిఎల్ సీజన్ కోసం సన్నాహాలను ప్రారంభించాడు. గత ఏడాది రన్నరప్ ఢిల్లీ కెపిటల్స్‌తో చెన్నై జట్టు ఏప్రిల్ 10 న ముంబైలోని వాంఖడే స్టేడియంలో తన మొదటి మ్యాచ్‌లో తలపడనుంది.

రైనా లేకపోవడం చెన్నైకు లోటే 
వ్యక్తిగత కారణాల వల్ల యూఏఈలో జరిగిన గత సీజన్‌కు రైనా మిస్‌ కావడం, చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్‌కే లీగ్‌ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. రైనా లాంటి స్టార్ బ్యాట్స్ మన్ సీఎస్‌కేకి లేకపోవడమే గత ఐపిఎల్ లో ఆ జట్టు లీగ్‌ పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో నిలవడానికి  ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు.

(చదవండి : 'ఐపీఎల్‌ మాకు మేలు చేసింది.. డబ్బుతో వెలకట్టలేం' )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement