'కెరీర్‌ నాశ‌నం చేసుకుంటున్నావు.. అత‌డిని చూసి నేర్చుకో' | Sanju Samson's fitness, not form behind snub from playing XI | Sakshi
Sakshi News home page

'కెరీర్‌ నాశ‌నం చేసుకుంటున్నావు.. అత‌డిని చూసి నేర్చుకో'

Jul 8 2026 2:00 PM | Updated on Jul 8 2026 3:34 PM

Sanju Samson's fitness, not form behind snub from playing XI

టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ త‌న టీ20 కెరీర్‌లో అత్యంత  క్లిష్టమైన ద‌శ‌ను ఎదుర్కొంటున్నాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో ప్లేయ‌ర్ ఆఫ్‌ది టోర్న‌మెంట్‌గా నిలిచిన సంజూ.. ఇప్పుడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే జ‌ట్టులో చోటు కోల్పోవ‌డం తీవ్ర చర్చానీయంశ‌మైంది. 

కేవ‌లం మూడు మ్యాచ్‌లలో విఫ‌లమైనందున అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించారు. ఐపీఎల్‌-2026లో దుమ్ములేపి ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంజా.. అక్క‌డ మాత్రం త‌న జోరును కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఐర్లాండ్‌తో జ‌రిగిన రెండు మ్యాచ్‌ల‌లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే ప‌రిమిత‌మ‌య్యాడు. 

ఆ త‌ర్వాత ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కూడా కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి ఔటయ్యాడు. దీంతో ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ను ప‌క్క‌న పెట్టి.. యువ సంచల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీని తుది జ‌ట్టులోకి తీసుకొచ్చారు. రెండు, మూడు టీ20ల్లో సంజూ బెంచ్‌కే పరిమిత‌మ‌య్యాడు. 

అంతేకాకుండా జింబాబ్వేతో సిరీస్‌కు ఏకంగా ప్ర‌ధాన జ‌ట్టు నుంచే సంజూను త‌ప్పించారు. సీనియ‌ర్ బ్యాట‌ర్లంతా జ‌ట్టులో ఉన్న‌ప్ప‌టికి సంజూ ఒక్క‌డే పేరే లేక‌పోవ‌డం అంద‌రిని ఆశ్య‌ర్య‌ప‌రిచింది. కావాల‌నే సంజూను ప‌క్క‌న పెట్టార‌ని అభిమానులు సెల‌క్ట‌ర్ల‌పై విమర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల ప‌రంగా సంజూను జ‌ట్టు నుంచి త‌ప్పించిండొచ్చు అని అత‌డు అభిప్రాయ‌ప‌డ్డాడు.

"ఫిట్‌నెస్ లోపం వ‌ల్లే సంజూ శాంస‌న్‌ను జ‌ట్టు నుంచి త‌ప్పించార‌ని అనుకుంటున్నాను. ఒక‌వేళ అదే కార‌ణ‌మైతే, సెల‌క్ట‌ర్లు, టీమ్ మేనెజ్‌మెంట్‌ తీసుకున్న‌ది స‌రైన నిర్ణ‌య‌మే అని చెప్పాలి. అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ, శారీరక దృఢత్వం లోపం వల్ల శాంస‌న్‌ తన కెరీర్‌ను నాశ‌నం చేసుకుంటున్నాడు. 

ఈ దశలో అతను విరాట్ కోహ్లిని రోల్ మోడల్‌గా తీసుకుని ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాల‌ని" ఎక్స్ వేదిక‌గా మంజ్రేక‌ర్ రాసుకొచ్చాడు. కాగా సంజూకు అయితే ఎలాంటి ఫిట్‌నెస్ స‌మ‌స్య‌లు లేవు. కేవ‌లం ఫామ్ కార‌ణంగా ప‌క్క‌న పెట్టామ‌ని హెడ్‌కోచ్ గౌత‌మ్ గంభీర్ మూడో టీ20 అనంత‌రం స్ప‌ష్టం చేశాడు. అయితే జింబాబ్వే టూర్‌కు ఎంపిక కాన‌ప్ప‌టికి ఆసియా క్రీడ‌ల‌కు వెళ్లే భార‌త జ‌ట్టులో మాత్రం శాంస‌న్ చోటు ద‌క్కించుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement