RCB VS RR: Trent Boult Picks Off Virat Kohli For His 100th IPL Wicket - Sakshi
Sakshi News home page

RCB VS RR:సెంచరీ కొట్టిన బౌల్ట్‌

Apr 23 2023 4:40 PM | Updated on Apr 23 2023 5:54 PM

RCB VS RR: Trent Boult Picks Off Virat Kohli For His 100th IPL Wicket - Sakshi

photo credit: IPL Twitter

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో ఇవాళ (ఏప్రిల్‌ 23, మధ్యాహ్నం 3:30 గంటలకు) జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఓ అరుదైన మైల్‌స్టోన్‌ను అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో బౌల్ట్‌.. కోహ్లి వికెట్‌ పడగొట్టడంతో ఐపీఎల్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్‌లో 100 వికెట్‌ కోహ్లిది కావడం, అది కూడా కోహ్లిని గోల్డెన్‌ డకౌట్‌ చేయడం బౌల్ట్‌కు చిరకాలం​ గుర్తుండిపోతుంది.ఐపీఎల్‌లో మొత్తం 84 మ్యాచ్‌లు ఆడిన బౌల్ట్‌.. 101 వికెట్లు పడగొట్టాడు. 

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీకి తొలి బంతికే భారీ షాక్‌ తగిలింది. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ తొలి బంతికే గోల్డెన్‌ డకౌటై ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు. సొంత మైదానంలో ఇరగదీస్తాడనుకున్న కోహ్లి ఉసూరుమనిపించడంతో స్టేడియంలో ఒక్కసారిగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. 

కోహ్లి ఔటైన కొద్దిసేపటికే ఆర్సీబీ మరో వికెట్‌ కూడా కోల్పోయింది. బౌల్ట్‌ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి షాబాజ్‌ అహ్మద్‌ (2) ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ (35 బంతుల్లో 64), డుప్లెసిస్‌ (34 బంతుల్లో 56) బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 12 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 128/2గా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement