ఫస్ట్‌ ఓవర్‌లోనే ఫైనల్‌ స్కోరు.. ఫిక్సింగ్‌ కాదా?

MI'sTwitter Handle Mistakenly Tweets DCs Final Score - Sakshi

అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభం నుంచి ఫిక్సింగ్ రూమర్లు వస్తున్నా దానిని లైట్‌గానే తీసుకుంటున్నారంతా.  హోరాహోరీ పోరుల్లో మ్యాచ్‌లు ఎలా ఫిక్స్‌ చేస్తారని కొందరు, ఫిక్సింగ్‌ ఎలాగైనా చేయవచ్చని మరొకందరు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఫిక్సింగ్‌ ఎలాగైనా చేయవచ్చనే వారి వాదనకు బలం చేకూర‍్చుంది నిన్నటి ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌. దీనికి కారణం. ఢిల్లీ చేసిన ఫైనల్‌ స్కోరును ముంబై ఇండియన్స్‌ ట్వీటర్‌లో రివీల్‌ చేసిందంటూ ఒక వార్త చక్కర్లు కొట్టడమే. అసలు మ్యాచ్‌ ఆరంభమైన తొలి ఓవర్‌లోనే ఢిల్లీ చేయబోయే స్కోరును దాదాపు చెప్పేసిందని దాని సారాంశం. (చదవండి: పంత్‌ ఆడటంపై స్పష్టత లేదు: అయ్యర్‌)

ఢిల్లీ 19.5 ఓవర్లలో 163/ 5 అంటూ పోస్ట్‌ చేసింది. తమ బౌలింగ్‌ ఎటాక్‌ను జేమ్స్‌ పాటిన్‌సన్‌తో కలిసి బౌల్ట్‌ పంచుకుంటున్నాడు అనే విషయాన్ని చెప్పే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్కోరు వారి ట్విటర్‌ అకౌంట్‌లో దర్శనమిచ్చింది. ఇది పొరపాటును జరిగిందో, కావాలనే చేశారో కానీ ఇది పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి పాలైంది. ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ స్కోరు 4 వికెట్ల నష్టానికి 162. ఇప్పుడు దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా మ్యాచ్‌లు ఫిక్స్‌ చేసుకుని ఆడతారా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఢిల్లీ స్కోరును ముంబై తన ట్వీటర్‌ అకౌంట్‌లో ఎందుకు రివీల్‌ చేస్తుంది దానిపై కూడా అనుమానాలున్నాయి. అయినప్పటికీ ఇది అధికారిక ముంబై ఇండియన్స్‌ అకౌంట్‌లో కనిపించడం అభిమానుల్లో కలకల రేపుతోంది. ఇది కచ్చితంగా ఫిక్సింగ్‌ అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ చేస్తున్నారు.మరి నిజంగానే ముంబై ఇండియన్స్‌ చేసిందా.. లేక ఎవరైనా మార్ఫింగ్‌ లాంటిది ఏమైనా చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top