IPL 2022 MI VS DC: పంత్‌ను ఏకి పారేసిన రవిశాస్త్రి.. బ్రెయిన్‌ దొబ్బిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు

MI VS DC: Ravi Shastri Slams Rishabh Pant For Not Taking Review Against Tim David - Sakshi

ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక సమరంలో ఓడి, ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌పై టీమిండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌ పంత్‌ ఉదాసీనంగా వ్యవహరించి ముంబైని దగ్గరుండి మరీ గెలిపించాడని ధ్వజమెత్తాడు. టిమ్‌ డేవిడ్‌ డీఆర్‌ఎస్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంత్‌.. ఆర్సీబీకి (ప్లే ఆఫ్స్‌కు చేరేందుకు)పరోక్షంగా సహకరించాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

అవకాశమున్నా పంత్ సమీక్షను తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు. 2 సమీక్షలు మిగిలి ఉన్నా పంత్‌ కామన్ సెన్స్ ఉపయోగించలేకపోయాడని, అతని మైండ్‌ దొబ్బిందని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌ సరైన నిర్ణయం తీసుకోలేకపోతే పక్కనున్న ఆటగాళ్లైనా సలహా ఇవ్వాల్సిందని, కానీ వారు కూడా తమకేమీ పట్టలేదన్నట్లుగా వ్యవహరించారని దుయ్యబట్టాడు. ఢిల్లీ ఆటగాళ్లంతా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌ బెర్తును బంగారు పళ్లెంలో పెట్టి అందించారని అన్నాడు.

కాగా, ముంబైతో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ తొలి బంతికే క్యాచ్‌ ఔట్ కావాల్సింది. కానీ, రిషబ్‌ పంత్ డీఆర్‌ఎస్‌ తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించడంతో టిమ్‌ బయటపడ్డాడు. అనంతరం టిమ్‌ సుడిగాలి ఇన్నింగ్స్‌ (11 బంతుల్లోనే 34 పరుగులు) ఆడి ఢిల్లీ చేతుల్లోనుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఫలితంగా ఢిల్లీ ఇంటికి, ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరాయి. 
చదవండి: టీమిండియాలోకి డీకే.. రీ ఎంట్రీపై ఆసక్తికర ట్వీట్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-05-2022
May 23, 2022, 09:47 IST
తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడేందుకు కోల్‌కతా బయల్దేరిన రాజస్థాన్ రాయల్స్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. నిన్న (మే 22)...
23-05-2022
May 23, 2022, 07:15 IST
ముంబై: ఎనిమిది జట్లు పాల్గొన్న గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎనిమిదో స్థానం... పది జట్లు పాల్గొన్న ఈసారి ఐపీఎల్‌లోనూ...
22-05-2022
May 22, 2022, 19:07 IST
ఐపీఎల్‌-2022 అఖరి లీగ్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై పంజాబ్‌ కింగ్స్‌ ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 158...
22-05-2022
May 22, 2022, 16:57 IST
ఐపీఎల్‌-2022 సీజన్‌ ఆరంభంలో అద్భుతంగా రాణించిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ పేసర్‌ టి. నటరాజన్‌.. టోర్నీ సెకెండ్‌ హాఫ్‌లో...
22-05-2022
May 22, 2022, 16:51 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇతర జట్ల జయాపజాలపై ఆధారపడి అతికష్టం మీద ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన ఆర్సీబీ ఓ...
22-05-2022
May 22, 2022, 16:02 IST
సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఢిల్లీ పుట్టి ముంచి, ఆర్సీబీని ప్లే ఆఫ్స్‌కు చేర్చిన ముంబై హార్డ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌పై ఆర్సీబీ...
22-05-2022
May 22, 2022, 15:22 IST
ఐపీఎల్ 2022 సీజన్‌ ఇవాళ (మే 22) చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌ జరుగనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా సన్‌రైజర్స్‌, పంజాబ్‌...
22-05-2022
May 22, 2022, 13:57 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చేదు అనుభవాల్ని మిగిల్చింది. ఐపీఎల్‌ చరిత్రలో గతంలో ఎన్నడూ...
22-05-2022
May 22, 2022, 13:28 IST
 శ్రేయస్‌ నుంచి పగ్గాలు చేపట్టాడు.. ఢిల్లీ కెప్టెన్‌గా పంత్‌ కరెక్ట్‌: పాంటింగ్‌
22-05-2022
May 22, 2022, 13:19 IST
ఐపీఎల్ 2022 సీజన్‌ చిట్టచివరి లీగ్‌ మ్యాచ్‌లో ఇవాళ (మే 22) సన్‌రైజర్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని...
22-05-2022
May 22, 2022, 13:14 IST
కోల్‌కతా నగరాన్ని తుఫాన్‌ ముంచెత్తింది. శనివారం రాత్రి ఈదురుగాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి కోల్‌కతాలోని...
22-05-2022
May 22, 2022, 12:15 IST
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...
22-05-2022
May 22, 2022, 12:09 IST
IPL 2022: ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లి, ఆర్సీబీ ఫైనల్‌ ఫోర్‌కు చేరేలా చేసిన ముంబై ఇండియన్స్‌...
22-05-2022
May 22, 2022, 11:48 IST
ముంబై చేతిలో ఢిల్లీ ఓటమి.. అంబరాన్నంటిన ఆర్సీబీ సంబరాలు.. వీడియో
22-05-2022
May 22, 2022, 11:02 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో శనివారం ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్‌గా...
22-05-2022
May 22, 2022, 11:02 IST
ఓటమిపై తీవ్ర అసంతృప్తిలో పంత్‌, దీనికి కారణం!
22-05-2022
May 22, 2022, 09:25 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కథ లీగ్‌ దశలోనే ముగిసింది. కచ్చితంగా ప్లే ఆఫ్స్‌ చేరుకుంటుందని అంతా అనుకున్న...
22-05-2022
May 22, 2022, 08:44 IST
ఆట అన్నాకా గెలుపోటములు సహజం. మ్యాచ్‌ ఎంత ఉత్కంఠగా సాగినా ఒకరిని మాత్రమే విజయం వరిస్తుంది.  యాదృశ్చికం అనాలో లేక...
22-05-2022
May 22, 2022, 08:04 IST
ముంబై ఇండియన్స్‌ యువ ఆటగాడు.. తెలుగుతేజం నంబూరి తిలక్‌ వర్మ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. డెబ్యూ సీజన్‌లో ఒక...
22-05-2022
May 22, 2022, 05:53 IST
ముంబై: సీజన్‌ ఆసాంతం నిరాశపరిచిన ముంబై ఇండియన్స్‌ తమ చివరి మ్యాచ్‌లో అభిమానుల్ని మురిపించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచి... రాయల్‌... 

Read also in:
Back to Top