T20 WC 2022: 'ఆ ఆల్‌రౌండర్‌కు భారత జట్టులో చోటు దక్కడం చాలా కష్టం'

Manjrekar raises doubt over Ravindra Jadejas selection in Indias T20 WC squad - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆల్‌రౌండర్‌ జడేజా చోటు సంపాదించడం చాలా కష్టమని అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచ కప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ భారత జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనే దానిపై ప్రస్తుతం చాలా చర్చలు జరుగుతున్నాయి.

ముఖ్యంగా లోయర్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తుండడంతో జట్టు ఎంపిక చేయడం సెలక్టర్లకు సవాల్‌తో కూడుకున్నదే అని చెప్పుకోవాలి. కాగా ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు గాయం కారణంగా జడేజా దూరమయ్యాడు. అయితే ఐపీఎల్‌-2022లో ఆడిన జడేజా తీవ్రంగా నిరాశపరిచాడు. 10 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ.. 116 పరుగులతో పాటు 5వికెట్లు పడగొట్టాడు.

"ఏడో స్థానంలో దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ, ఐపీఎల్‌లోను కార్తీక్ దుమ్మురేపాడు. కాబట్టి కార్తీక్‌ స్ధానంలో జడేజా జట్టులోకి రావడం అంత సులభం కాదు అని భావిస్తున్నాను. అదే విధంగా హార్దిక్ పాండ్యా కూడా భీకర ఫామ్‌లో ఉన్నాడు.

బ్యాటింగ్‌ పరంగా టీమిండియా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే జడేజాకు కూడా జట్టును గెలిపించగల సత్తా ఉంది. చాలా మ్యాచ్‌లలో భారత జట్టును ఒంటి చేత్తో జడేజా విజయ తీరాలకు చేర్చాడు. కాబట్టి టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేయడంలో సెలక్టర్లకు తలనొప్పి రావడం ఖాయమని" సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.
చదవండి: IRE vs IND: 'టీమిండియా అత్యుత్తమ జట్టు.. మేము గట్టి పోటీ ఇస్తాం'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top