IPL 2022 LSG VS MI: శతక్కొట్టిన కేఎల్‌ రాహుల్‌.. లక్నో భారీ స్కోర్‌

LSG VS MI: KL Rahul Scores Century In 100th IPL Match - Sakshi

KL RahuL: బ్రబోర్న్‌ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ సారధి కేఎల్‌ రాహుల్‌ అద్భుతమైన శతకాన్ని  సాధించాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో వందో మ్యాచ్‌ ఆడుతున్న రాహుల్‌.. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు. సెంచరీ మార్కును బౌండరీతో అధిగమించిన రాహుల్‌.. ఈ క్రమంలో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌ వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా రెండో శతకాన్ని నమోదు చేసిన రాహుల్‌.. ఐపీఎల్‌ చరిత్రలో  విరాట్‌ కోహ్లి తర్వాత కెప్టెన్‌గా రెండు, అంతకంటే ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. 

ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి అత్యధికంగా ఐదు సెంచరీలు బాదాడు. ఈ శతకం ద్వారా రాహుల్‌ మరో రికార్డును కూడా నెలకొల్పాడు. ఒకే జట్టుపై రెండు సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్‌ గేల్‌ (పంజాబ్‌పై 2 సెంచరీలు), విరాట్‌ కోహ్లి (గుజరాత్‌ లయన్స్‌పై 2 సెంచరీలు), డేవిడ్‌ వార్నర్‌ (కేకేఆర్‌పై 2 సెంచరీలు)ల సరసన చేరాడు. ఇదిలా ఉంటే, ముంబైతో మ్యాచ్‌లో రాహుల్‌ అద్భుతమైన శతకం బాదటంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్‌ 60 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలువగా, డికాక్‌ (13 బంతుల్లో 24; 4 ఫోర్లు, సిక్స్‌), మనీశ్‌ పాండే (29 బంతుల్లో 38; 6 ఫోర్లు), స్టోయినిస్‌ (9 బంతుల్లో 10; సిక్స్‌), దీపక్‌ హుడా (8 బంతుల్లో 15; ఫోర్‌, సిక్స్‌) ఔటయ్యారు.
చదవండి: రాహుల్‌ కాదు, పంత్‌ కాదు.. టీమిండియా తదుపరి కెప్టెన్‌ అతడే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top