కేఎల్‌ రాహుల్‌ అవుట్‌ 

KL Rahul missed the fourth Test against England - Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా గత రెండు టెస్టులు ఆడని రాహుల్‌ కోలుకున్నాడని... ఈనెల 23 నుంచి జరిగే రాంచీ టెస్టులో ఆడతాడని వార్తలు వచ్చాయి. అయితే అతను పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో మరో మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

కోలుకుంటేనే చివరి టెస్టుకు అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది. మరోవైపు పని భారం కారణంగా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు కూడా ఈ మ్యాచ్‌ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించిన బోర్డు... అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. రాజ్‌కోట్‌ టెస్టు ఆడని ముకేశ్‌ నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు.   

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top