చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. ఏకైక బ్యాటర్‌గా | KL Rahul Creates History Becomes the 1st player In IPL to | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన కేఎల్‌ రాహుల్‌.. ఏకైక బ్యాటర్‌గా

May 8 2026 9:06 PM | Updated on May 8 2026 9:06 PM

KL Rahul Creates History Becomes the 1st player In IPL to

టీమిండియా స్టార్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. కాగా కెప్టెన్‌గా లక్నో సూపర్‌ జెయింట్స్‌ను అరంగేట్ర సీజన్‌లో (2022)నే ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు రాహుల్‌.

అయితే, 2024లో జట్టు ప్రదర్శన దిగజారడంతో ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్‌ గోయెంకా బహిరంగంగానే రాహుల్‌కు చివాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పెద్ద ఎత్తున వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో తనకు స్వేచ్ఛ, గౌరవం లేని చోట ఉండలేనంటూ.. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు రాహుల్‌.

దుమ్ములేపుతున్న కేఎల్‌ రాహుల్‌
ఐపీఎల్‌-2025లో ఢిల్లీ తరఫున 13 మ్యాచ్‌లలో కలిపి 539 పరుగులు సాధించాడు. ఇక ఈ సీజన్‌లోనూ దుమ్ములేపుతున్న కేఎల్‌ రాహుల్‌.. శుక్రవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.

అరుణ్‌జైట్లీ మైదానంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో 14 బంతుల్లో 23 పరుగులు చేసిన రాహుల్‌.. ఢిల్లీ తరఫున వెయ్యి పరుగుల మార్కు అందుకున్నాడు. మొత్తంగా ఈ సీజన్‌లో ఇప్పటికి 11 ఇన్నింగ్స్‌లో కలిపి 468 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

ఏకైక బ్యాటర్‌గా
ఈ క్రమంలోనే రాహుల్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో మూడు వేర్వేరు జట్ల తరఫున వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా 2013లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన కేఎల్‌ రాహుల్‌.. ఆ తర్వాత పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్లకు ఆడాడు.

గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌తో జట్టుకట్టిన రాహుల్‌.. తాజాగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందు పంజాబ్‌ కింగ్స్‌, లక్నో తరఫునా ఈ ఘనత సాధించాడు.

ఐపీఎల్‌లో మూడు వేర్వేరు జట్ల తరఫున 1000 పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌
👉పంజాబ్‌ కింగ్స్‌- 2548 పరుగులు
👉లక్నో సూపర్‌ జెయింట్స్‌- 1410 పరుగులు
👉ఢిల్లీ క్యాపిటల్స్‌- 1002* పరుగులు.

చదవండి: ఏబీ డివిలియర్స్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisement
 
Advertisement
Advertisement