ఆ ముగ్గురి తర్వాతే జో రూట్‌.. | Joe Root Is Notch Below Kohli, Smith And Williamson Says Sunil Gavaskar | Sakshi
Sakshi News home page

లిటిల్‌ మాస్టర్‌ సంచలన వ్యాఖ్యలు

Feb 12 2021 4:22 PM | Updated on Feb 12 2021 4:57 PM

Joe Root Is Notch Below Kohli, Smith And Williamson Says Sunil Gavaskar - Sakshi

ప్రస్తుత క్రికెట్‌లో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మెనే అయినప్పటికీ.. విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ల తర్వాతే అంటున్నాడు లిటిల్ మాస్టర్ సునీల్‌ గవాస్కర్‌.

చెన్నై: ప్రస్తుత క్రికెట్‌లో ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్‌ అత్యుత్తమ బ్యాట్స్‌మెనే అయినప్పటికీ.. విరాట్‌ కోహ్లీ, స్టీవ్‌ స్మిత్‌, కేన్‌ విలియమ్సన్‌ల తర్వాతే అంటున్నాడు లిటిల్ మాస్టర్ సునీల్‌ గవాస్కర్‌. విరాట్‌, స్మిత్‌, విలియమ్సన్‌లతో పోలిస్తే టెక్నిక్‌ పరంగా రూట్‌ కాస్త వెనుకపడ్డాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తొలి టెస్ట్‌లో రూట్‌ తన స్థాయికి తగ్గ ఆట ఆడాడని ప్రశంసించాడు. తొలి టెస్టులో జో రూట్‌ అద్భుతమైన ద్విశతకంతో అదరగొట్టాడని, అంతకు ముందు శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ అతను భీకరమైన ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. శ్రీలంకతో సిరీస్‌లో సైతం రూట్‌ వరుస శతకాలతో అదరగొట్టాడని ఆకాశానికెత్తాడు. 

రూట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడని, ఉపఖండంపు పిచ్‌లపై పరుగుల వరద పారిస్తున్నాడన్నాడు. అయితే ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌కు పోటీ మాత్రం స్మిత్, కోహ్లీ మధ్యే ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 227 పరుగుల తేడాతో పరాజయం పాలై, నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-1తేడాతో వెనుకపడి ఉంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్‌ చెన్నై వేదికగా రేపటి నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒక మార్పుతో(నదీమ్‌కు బదులు అక్షర్‌), ఇంగ్లండ్‌ నాలుగు మార్పులతో(అండర్సన్‌, ఆర్చర్‌, బట్లర్‌, బెస్‌ల స్థానంలో వోక్స్‌, బ్రాడ్‌, ఫోక్స్‌, మొయిన్‌ అలీ) బరిలోకి దిగుతుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement