సునీల్‌ నరైన్‌ సరికొత్త చరిత్ర | IPL 2026 SRH VS KKR, Sunil Narine Becomes First Overseas Bowler To Take 200 IPL Wickets, Creates History For KKR | Sakshi
Sakshi News home page

సునీల్‌ నరైన్‌ సరికొత్త చరిత్ర

May 3 2026 5:08 PM | Updated on May 3 2026 6:19 PM

IPL 2026 SRH VS KKR: Sunil Narine Completes 200 Wickets in IPL

కేకేఆర్‌ స్టార్‌ స్పిన్నర్‌ సునీల్‌ నరైన్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో 200 వికెట్లు తీసిన తొలి విదేశీ బౌలర్‌గా, ఓవరాల్‌గా మూడో బౌలగా రికార్డు నెలకొల్పాడు. ఒకే ఫ్రాంచైజీ తరఫున ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కాడు. 

నరైన్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌ ప్రారంభం నుంచి (2012) కేకేఆర్‌కు మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన మిగతా ఇ‍ద్దరు బౌలర్లు చహల్‌ (228), భువనేశ్వర్‌ కుమార్‌ (215) ఒకటికి మించి ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించారు.

నరైన్‌ తన 197 మ్యాచ్‌ల ఐపీఎల్‌ కెరీర్‌లో ఓ 5 వికెట్ల ప్రదర్శన, ఏడు 4 వికెట్ల ప్రదర్శనల సాయంతో 201 వికెట్లు తీశాడు. నరైన్‌ ఎకానమీ (6.79) టాప్‌-2 బౌలర్లు చహల్‌ (8.02), భువీ (7.68) కంటే తక్కువ ఉండటం​ మరో రికార్డు. ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాల్టి (మే 3) మధ్యాహ్నం మ్యాచ్‌లో నరైన్‌ ఈ చారిత్రక మైలురాయిని అధిగమించాడు. 

ఈ మ్యాచ్‌లో నరైన్‌ 4 ఓవర్లలో 31 పరుగులకు 2 వికెట్లు తీశాడు. తొలుత తీసిన సలీల్‌ అరోరా వికెట్‌ నరైన్‌కు డబుల్‌ సెంచరీ వికెట్‌. ఆతర్వాత అతను కీలకమైన ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కూడా తీసి సన్‌రైజర్స్‌ను భారీ దెబ్బ కొట్టాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న సన్‌రైజర్స్‌ కేకేఆర్‌ బౌలర్ల ధాటికి 17.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. నరైన్‌తో పాటు వరుణ్‌ చక్రవర్తి (4-0-36-3),  వైభవ్‌ ఆరోరా (2.3-0-23-1) కార్తీక్‌ త్యాగి (3-0-24-1), గ్రీన్‌ (3-0-34-1), అనుకూల్‌ రాయ్‌ (1-0-8-1) సన్‌రైజర్స్‌ను ఇబ్బంది పెట్టారు. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ట్రవిస్‌ హెడ్‌ (61) అర్ద సెంచరీతో సత్తా చాటగా.. ఇషాన్‌ కిషన్‌ (42) రాణించాడు. మిగతా ఆటగాళ్లలో అభిషేక్‌ శర్మ 15, క్లాసెన్‌ 11, స్మరణ్‌ రవిచంద్రన్‌ 4, అనికేత్‌ వర్మ 6, సలీల్‌ అరోరా 2, కమిన్స్‌ 10, శివాంగ్‌ కుమార్‌ 1 పరుగుకు ఔటయ్యారు. హర్షల్‌ పటేల్‌ 1, ఎషాన్‌ మలింగ 1 పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement