ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఢిల్లీ విధించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 14.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
ఫిన్ అలెన్ (47 బంతుల్లోనే 100 నాటౌట్) అజేయ సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కామరున్ గ్రీన్ 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక్క వికెట్ తీశాడు. అంతకముందు కేకేఆర్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.
ఫిన్ అలెన్ హాఫ్ సెంచరీ.. లక్ష్యానికి చేరువగా కేకేఆర్
ఐపీఎల్ 19వ సీజన్‌లో ఫిన్ అలెన్ తొలిసారి తన ప్రభావం చూపిస్తుండడంతో కేకేఆర్ లక్ష్యానికి చేరువగా వస్తోంది.143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (61), గ్రీన్ (29) పరుగులతో ఆడుతున్నారు.
ఏడు ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ఫిన్ అలెన్ (32), కామెరున్ గ్రీన్ (10) పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో అంగ్‌క్రిష్ రఘువంశీ (1) క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అంతకముందు 13 పరుగులు చేసిన కెప్టెన్ రహానే రనౌటయ్యాడు. 4 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.
కేకేఆర్ లక్ష్యం 143 పరుగులు..
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. కేకేఆర్ బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (50) అర్థసెంచరీతో రాణించగా.. చివర్లో అశుతోశ్ శర్మ (39) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కేకేఆర్ బౌలర్లలో అనుకుల్ రాయ్, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు పడగొట్టగా, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, గ్రీన్ తలా ఒక వికెట్ తీశారు.
ఆరో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
అక్షర్ పటేల్ (11) రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ 128 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
18 ఓవర్లలో ఢిల్లీ 126/5
18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. అశుతోశ్ శర్మ (28), అక్షర్ పటేల్ (10) పరుగులతో ఆడుతున్నారు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
పదో ఓవర్ రెండో బంతికి నిస్సాంకను అవుట్ చేసిన అనుకుల్ రాయ్.. ఐదో బంతికి స్టబ్స్(2)ను బౌల్డ్ చేశాడు. దీంతో ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది.
నాలుగో వికెట్ డౌన్
10.2అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో నిస్సాంక స్టంపౌట్. 29 బంతుల్లో 50 పరుగుల చేసి నిష్క్రమించిన నిస్సాంక. క్రీజులోకి అక్షర్ పటేల్. ఢిల్లీ స్కోరు: 89-4(10.4). స్టబ్స్ రెండు పరుగులతో ఉన్నాడు.
మూడో వికెట్ కోల్పోయిన ఢిల్లీ
సునిల్ నరైన్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన సమీర్ రిజ్వి (3). క్రీజులోకి ట్రిస్టన్ స్టబ్స్ స్కోరు: 80-3 (10).
రెండో వికెట్ డౌన్
8 పరుగులు చేసిన నితీశ్ రానా కామెరున్ గ్రీన్ బౌలింగ్‌లో సునీల్ నరైన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో 74 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. నిస్సాంక 43 పరుగులతో ఆడుతున్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ (23) రూపంలో తొలి వికెట్ వికెట్ కోల్పోయింది. కార్తిక్ త్యాగి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే యత్నంలో బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్‌లో ఉన్న కామెరున్ గ్రీన్ ఎలాంటి తప్పు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. నిస్సాంక 31 పరుగులతో ఆడుతున్నాడు.
4 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. నిస్సాంక (25) పరుగులతో ధాటిగా ఆడుతుండగా, కేఎల్ రాహుల్ (14) అతడికి సహకరిస్తున్నాడు.
టాస్ నెగ్గిన కేకేఆర్
టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లు ఎలాంటి మార్పు లేకుండానే మ్యాచ్‌లో బరిలోకి దిగుతున్నాయి. ముఖాముఖి పోరులో ఇరుజట్లు 34 సార్లు తలపడ్డాయి. ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ 19 సార్లు, 15 సార్లు కేకేఆర్ గెలిచింది. ఇక అరుణ్‌జైట్లీ స్టేడియంలో కేకేఆర్ 6 సార్లు, ఢిల్లీ 5 సార్లు విజయం సాధించాయి.
తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్య రహానే(సి), అంగ్క్రిష్ రఘువంశీ(w), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, మనీష్ పాండే, రింకూ సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, కార్తీక్ త్యాగి, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి
ఢిల్లీ క్యాపిటల్స్: పాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(w), నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(సి), అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, లుంగి ఎన్గిడి, ముఖేష్ కుమార్
కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ సబ్‌లు: రమణదీప్ సింగ్, ఫిన్ అలెన్, తేజస్వి దహియా, నవదీప్ సైనీ, టిమ్ సీఫెర్ట్
ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ సబ్‌లు: కరుణ్ నాయర్, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, అభిషేక్ పోరెల్, డేవిడ్ మిల్లర్
🚨Toss update from Delhi🚨@kkriders won the toss and elected to bowl first against @DelhiCapitals
Updates ▶️ https://t.co/NaWLphmJKY#TATAIPL | #KhelBindaas | #DCvKKR pic.twitter.com/Nd38qv8r3f— IndianPremierLeague (@IPL) May 8, 2026


