ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్‌ | IPL 2024, GT vs DC: Gujarat Titans All Out Below 100 Runs For The First Time In IPL History | Sakshi
Sakshi News home page

ఢిల్లీ బౌలర్ల విజృంభణ.. ఐపీఎల్‌లో అత్యల్ప స్కోర్‌ నమోదు చేసిన గుజరాత్‌

Apr 17 2024 9:32 PM | Updated on Apr 18 2024 9:39 AM

IPL 2024 GT VS DC: Gujarat Titans All Out Below 100 Runs For The First Time In IPL History - Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ.. గుజరాత్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై ఎదురుదాడికి దిగి, ఆ జట్టును కకావిలకలం చేసింది.  

ఇషాంత్‌ శర్మ (2-0-8-2), ముకేశ్‌ కుమార్‌ (2.3-0-14-3), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (1-0-11-2), అక్షర్‌ పటేల్‌ (4-0-17-1), ఖలీల్‌ అహ్మద్‌ (4-1-18-1), కుల్దీప్‌ యాదవ్‌ (4-0-16-0) విజృంభించడంతో గుజరాత్ 17.3 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది.

వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ రెండు క్యాచ్‌లు, రెండు స్టంపౌట్లు చేసి గుజరాత్‌ పతనంలో కీలక భాగస్వామి అయ్యాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో రషీద్‌ ఖాన్‌ (31) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. సాయి సుదర్శన్‌ (12), తెవాటియా (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 

గుజరాత్‌ చెత్త రికార్డు..

  • ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ 100లోపు ఆలౌట్‌ కావడం ఇదే మొదటిసారి. 
  • 2024 సీజన్‌లో ఓ జట్టు 100లోపు ఆలౌట్‌ కావడం కూడా ఇదే మొదటిసారి. 
  • ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ చేసిన 89 పరుగుల స్కోర్‌.. ఇపీఎల్‌ చరిత్రలో ఆ జట్టుకు అత్యల్ప స్కోర్‌
  • ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఇదే అత్యల్ప టీమ్‌ స్కోర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement