IPL 2023: CSK Released Video Of MS Dhoni Suffering With Knee Injury Viral - Sakshi
Sakshi News home page

MS Dhoni: నడవడానికే ఇబ్బందిగా ఉంది.. ధోనికి ఏమైంది!

Apr 13 2023 6:38 PM | Updated on Apr 13 2023 6:48 PM

IPL 2023-CSK Released Video MS Dhoni Suffering With Knee Injury Viral  - Sakshi

Photo: CSK Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎంఎస్‌ ధోని వింటేజ్‌ మహీని తలపిస్తున్నాడు. క్రీజులో అడుగుపెట్టిందే మొదలు బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతీసారి అదే మంత్రం జపించిన ధోని తాజాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లోనూ అదే సీన్‌ను రిపీట్‌ చేశాడు. చేజింగ్‌లో మునుపటి ధోనిని తలపిస్తూ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన ధోని మ్యాచ్‌ను దాదాపు సీఎస్‌కే చేతుల్లోకి తెచ్చేశాడు. అయితే రాజస్తాన్‌ బౌలర్‌ సందీప్‌ శర్మ ఆఖరి మూడు బంతులను తెలివిగా వేయడంతో సీఎస్‌కే మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది.

మ్యాచ్‌ సంగతి పక్కనబెడితే.. ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు జట్టు కోచ్‌ స్టీఫెన్‌ ప్లెమింగ్‌ ప్రకటించాడు. ధోని గాయం సీఎస్‌కే ఫ్యాన్స్‌లో కాస్త ఆందోళన కలిగించింది. తాజాగా సీఎస్‌కే ధోని మోకాలి నొప్పితో బాధపడుతున్న వీడియోనూ షేర్‌ చేసింది. ఆ వీడియోలో పెవిలియన్‌కు వెళ్తున్న ధోని నడవడానికి కాస్త ఇబ్బంది పడినట్లుగా తెలుస్తోంది. అయితే సీఎస్‌కే మాత్రం ఏ వారియర్‌.. ఏ వెటరన్‌.. ఏ ఛాంపియన్‌.. వన్‌ అండ్‌ ఓన్లీ అంటూ క్యాప్షన్‌ జత చేసి అతన్ని చీర్‌అప్‌ చేసింది.

''ప్రస్తుతం ధోని వైద్యలు పర్యవేక్షణలో ఉన్నాడు. మోకాలి నొప్పికి సంబంధించి చికిత్స తీసుకుంటున్నాడు. తర్వాతి మ్యాచ్‌కు నాలుగు రోజులు సమయం ఉండంతో అప్పటిలోగా ధోని కోలుకుంటాడని ఆశిస్తున్నా'' అంటూ ప్లెమింగ్‌ తెలిపాడు.

చదవండి: Sandeep Sharma: తండ్రి బౌలింగ్‌ చూసి కేరింతలు కొట్టిన కూతురు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement