IPL 2022 DC Vs RR: Brutal Trolls On Sanju Samson Share Photo With Rishabh Pant, See Netizens Reaction - Sakshi
Sakshi News home page

IPL 2022 DC Vs RR: పంత్‌తో ఫొటో షేర్‌ చేసిన సంజూ.. మరి అంపైర్‌ ఎక్కడ? దారుణంగా ట్రోల్స్‌!

Apr 23 2022 10:06 AM | Updated on Apr 23 2022 11:10 AM

IPL 2022 DC Vs RR: Trolls On Sanju Samson Share Photo With Rishabh Pant - Sakshi

రిషభ్‌ పంత్‌తో రాజస్తాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌(PC: Sanju Samson Twitter)

DC Vs RR: పంత్‌తో ఫొటో షేర్‌ చేసిన సంజూ.. మరి అంపైర్‌ ఎక్కడ? దారుణంగా ట్రోల్స్‌!

IPL 2022 DC Vs RR- Sanju Samson: ఐపీఎల్‌-2022లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చివరికి 15 పరుగుల తేడాతో రాజస్తాన్‌ గెలుపొందింది. అయితే చివరి ఓవర్‌లో చెలరేగిన ‘నో బాల్‌’ వివాదం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ క్రమంలో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ విజయానంతరం ట్విటర్‌లో చేసిన పోస్టుపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ‘‘మీది అసలైన గెలుపు కాదు! నీకంటే పంత్‌ ఎన్నో రెట్లు బెటర్‌. అంపైర్‌కు ఎంత ముట్టజెప్పారు?’’ అంటూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. కాగా రిషభ్‌ పంత్‌ తనకు చెయ్యెత్తి విష్‌ చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోను పంచుకున్న సంజూ.. నైజ్‌ విన్‌(Nizee Winn) అని క్యాప్షన్‌ జత చేశాడు. 

ఇదే శాంసన్‌ మీద ట్రోల్స్‌కు కారణమైంది. కాగా అద్భుతమైన, సులభతరమైన గెలుపు లేదంటే.. విజయంతోనే నోరు మూయించాం(nize) అన్నట్లుగా సదరు పదానికి అర్థాలు ఆపాదిస్తున్న నెటిజన్లు.. కావాలనే సంజూ ఇలా ట్వీట్‌ చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయినా, పంత్‌ ఒక్కడి ఫొటో మాత్రమే ఎందుకు? మీకు సాయం చేసిన అంపైర్‌ ఫొటో కూడా షేర్‌ చేయొచ్చు కదా! హుందాగా ప్రవర్తిస్తే అందరికీ మంచిది’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న జోస్‌ బట్లర్‌(65 బంతుల్లో 116 పరుగులు) ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆఖర్లో ఢిల్లీ శిబిరంలో ఆశలు రేపిన రోవ్‌మన్‌ పావెల్‌(15 బంతుల్లో 36 పరుగులు)ను రాజస్తాన్‌ బౌలర్‌ మెక్‌కాయ్‌ అవుట్‌ చేయడంతో ఢిల్లీకి నిరాశ తప్పలేదు. 

ఐపీఎల్‌ -2022 మ్యాచ్‌ 34: ఢిల్లీ క్యాపిటల్స్‌ వర్సెస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ స్కోర్లు:
రాజస్తాన్‌-222/2 (20)
ఢిల్లీ- 207/8 (20)

చదవండి👉🏾Rishabh Pant: అలా చేయడం తప్పే.. కానీ మేము నష్టపోయాం.. థర్డ్‌ అంపైర్‌ జోక్యం చేసుకోవాల్సింది: పంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement