సురేశ్‌ రైనా, అంబటి రాయుడు వీడియో వైరల్‌‌‌

IPL 2021: Raina, Rayudu Showing Off Their Cooking Skills - Sakshi

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అంచనాలకు తగ్గట్టు ఆడుతూ దూసుకుపోతోంది. ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత సీఎస్‌కే ఒక్కసారిగా పుంజుకుంది. హ్యాట్రిక్‌ విజయాలతో దుమ్ములేపింది. ఆదివారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగనున్న మ్యాచ్‌లో సీఎస్‌కే తలపడనుంది. బుధవారం(ఏప్రిల్‌ 21వ తేదీ) కేకేఆర్‌తో జరిగిన రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 18 పరుగుల  తేడాతో గెలిచింది. 

సీఎస్‌కే ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు నాలుగు రోజుల సమయం ఉండటంతో ఆటగాళ్లు ప్రాక్టీస్‌తో పాటు కాసేపు సేద తీరే అవకాశం దొరికింది. ఈ క్రమంలో అంబటి రాయుడు, సురేశ్‌ రైనాలు తమ కుకింగ్‌ స్కిల్స్‌ను బయటకు తీస్తున్నారు. సీఎస్‌కే క్యాంపులో చెఫ్‌లు వంటలు చేసేటప్పుడు వారి వద్దకు వెళ్లి మరీ వారి పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. దీనికి సంబంధించి వీడియో  వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ పంజాబ్‌ కింగ్స్‌,  రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లపై సీఎస్‌కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని సేన ఓటమి పాలైంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top