ధోనికి గుర్తుండిపోయే మ్యాచ్‌ ఇది..!

MS Dhoni Played His 200th Match For Chennai Super Kings - Sakshi

ముంబై: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌ సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అరుదైన మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించడం ఒకటైతే,  అది సీఎస్‌కే తరఫున ధోనికి 200వ మ్యాచ్‌ కావడం విశేషం. ఇప్పటివరకూ సీఎస్‌కే తరఫున ఆడిన ధోని 200 మ్యాచ్‌లు ఆడగా, అందులో 176 ఐపీఎల్‌లో ఆడాడు. మిగతా 24 మ్యాచ్‌లను చాంపియన్స్‌ లీగ్‌ టీ20(సీఎల్‌టీ) ద్వారా చెన్నైకు ప్రాతినిథ్యం వహించాడు. 2016, 2017 సీజన్లు మినహాయించి మిగతా అన్ని సందర్భాల్లోనూ సీఎస్‌కే తరఫునే ధోని ఆడుతున్నాడు. 2008లో ఆ ఫ్రాంచైజీ మొదలైన ధోని ప్రస్థానం నేటికీ కొనసాగుతూనే ఉంది. 

కాగా, ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌ కూడా ధోనినే. ఇప్పటివరకూ ధోని 206 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడగా, రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ తరఫున 2016-17 సీజన్లలో 30 మ్యాచ్‌లు ఆడాడు. ధోని తర్వాత స్థానాల్లో వరుసగా రోహిత్‌ శర్మ(202), దినేశ్‌ కార్తీక్‌(198), సురేశ్‌ రైనా(195)లు ఉన్నారు. ధోని ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అతని గణాంకాలు కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకూ సీఎస్‌కేకు మూడుసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ను అందించిన ధోని.. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడు. ఇప్పటివరకూ ధోని 4, 652 పరుగులు చేశాడు. ఇక్కడ ధోని సగటు 40.63గా ఉండగా, స్టైక్‌రేట్‌ 136. 67గా ఉంది. ఐపీఎల్‌లో ధోని 216 సిక్స్‌లు కొట్టగా, 313 ఫోర్లు సాధించాడు. 

ఇక్కడ చదవండి:  4–1–13–4
క్యాచ్‌ పట్టినప్పుడల్లా తొడగొట్టావు.. మ్యాచ్‌ తర్వాత నీ పరిస్థితి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top