మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్‌ కూడా రద్దు చేస్తారా! | IPL 2021: Michael Vaughan Takes Sly Dig At BCCI After T Natarajan Tests COVID19 Positive | Sakshi
Sakshi News home page

IPL 2021: మాతో టెస్టు రద్దు చేసుకున్నారు.. ఐపీఎల్‌ కూడా రద్దు చేస్తారా!

Sep 22 2021 7:01 PM | Updated on Sep 22 2021 7:56 PM

IPL 2021: Michael Vaughan Takes Sly Dig At BCCI After T Natarajan Tests COVID19 Positive - Sakshi

Michael Vaughan Comments On Natarajan Tests Covid Positive: ఐపీఎల్‌ 2021 ఫేజ్‌2లో  భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ నేడు తలపడనుం‍ది. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి కొన్ని గంటలు ముందు హైదరాబాద్‌ ఫాస్ట్‌బౌలర్‌ నటరాజన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో అతడితో స‌న్నిహితంగా ఉన్న విజయ్‌ శంకర్‌ సహా మరో ఐదుగురు సహాయ సిబ్బందిని  ఐసోలేష‌న్‌కు తరలించారు. ఈ క్రమంలో ఐపీఎల్‌ సెకెండ్‌ ఫేజ్‌లో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో బీసీసీఐపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్ వాన్ ఘాటు వాఖ్యలు చేశాడు. ‘చివరి టెస్ట్ రద్దు చేసుకున్నట్లు  ఐపీఎల్‌ను కూడా రద్దు చేసుకుంటారా?... అలా చేయరని నేను హామీ ఇస్తా...’ అంటూ మైకెల్ వాన్ ట్వీట్ చేశాడు.

కాగా టీమిండియా శిబిరంలో కరోనా కరోనా కేసులు నమోదు కావడంతో ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధాంతరంగా రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే భారత క్రికెటర్లు చివరి టెస్ట్‌ నుంచి తప్పుకున్నారని, వారికి దేశం తరఫున ఆడే టెస్ట్‌ మ్యాచ్‌ కంటే ఐపీఎల్‌ మ్యాచ్‌లంటేనే ముఖ్యమని ఐదో టెస్ట్‌ వాన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

చదవండిIPL 2021 2nd Phase DC VS SRH: నటరాజన్‌కు కరోనా.. అయినా మ్యాచ్‌ యథాతథం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement