Faf Du Plessis:100వ గేమ్‌.. నాలుగో ట్రోఫీ.. చాలా చాలా ప్రత్యేకం

IPL 2021 FInal: Faf Du Plessis No 4 In Trophy Cabinet In My 100th Game - Sakshi

IPL 2021 Final Faf Du Plessis Comments: ఐపీఎల్‌2021 సీజన్‌ ఆసాంతం అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్‌కింగ్స్‌ ఓపెనర్‌ ఫాప్‌ డుప్లెసిస్‌. 16 మ్యాచ్‌లు ఆడిన అతడు మొత్తంగా 633 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 95 నాటౌట్‌. దుబాయ్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మరోసారి విశ్వరూపం ప్రదర్శించిన డుప్లెసిస్‌... సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు.

59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల​ సాయంతో 86 పరగులు చేసి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి గనుక డుప్లెసిస్‌.. షాట్‌ ఆడి ఉంటే ఆరెంజ్‌ క్యాప్‌ అతడి సొంతమయ్యేది. కాగా డుప్లెసిస్‌కు ఇది 100వ ఐపీఎల్‌ మ్యాచ్‌ కావడం విశేషం. ఈ నేపథ్యంలో విజయానంతరం డుప్లెసిస్‌ మాట్లాడుతూ... ‘‘ఇది నిజంగా గొప్ప రోజు. 100వ ఐపీఎల్‌ గేమ్‌.

నేను ఇక్కడకు వచ్చి దాదాపు పదేళ్లు అవుతోంది. నాలుగోసారి ట్రోఫీ గెలవడం చాలా చాలా సంతోషంగా ఉంది. రుతు(మరో ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌​) ప్రతిభావంతుడు. ఇలాంటి మెరికల్లాంటి ఆటగాళ్లు ఉండటం భారత క్రికెట్‌కు వరమనే చెప్పాలి. జట్టు బాధ్యతను భుజాల మీద మోశాడు. అతడికి గొప్ప భవిష్యత్తు ఉంది’’ అని ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(635)పై ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ మ్యాచ్‌లో రుతు 32 పరుగులు చేశాడు.

చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్‌ గెలిచే అర్హత కేకేఆర్‌కు ఉంది: ధోని

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top