భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం | Indian womens hockey team second consecutive defeat | Sakshi
Sakshi News home page

భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో పరాజయం

Apr 28 2025 3:48 AM | Updated on Apr 28 2025 3:48 AM

Indian womens hockey team second consecutive defeat

పెర్త్‌: ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 2–3 గోల్స్‌ తేడాతో పరాజయం చవిచూసింది. భారత్‌ తరఫున జ్యోతి సింగ్‌ (13వ నిమిషంలో), సునెలితా టొప్పో (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టుకు ఇవీ స్టాన్స్‌బై (17వ నిమిషంలో), డేలీ డాల్‌కెన్స్‌ (48వ నిమిషంలో), జేమీ లీ సుర్హా (52వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. 

తొలి క్వార్టర్‌ చివర్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జ్యోతి సింగ్‌ గోల్‌గా మలచడంతో భారత్‌ ఖాతా తెరిచింది. నాలుగు నిమిషాల తర్వాత ఆసీస్‌ స్కోరును సమం చేసింది. ఒకదశలో మ్యాచ్‌ 1–1తో ‘డ్రా’గా ముగుస్తుందనిపించింది. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలో ఆసీస్‌ రెండు గోల్స్‌ చేసింది. మ్యాచ్‌ మరో నిమిషంలో ముగుస్తుందనగా భారత్‌ రెండో గోల్‌ చేసినా పరాజయాన్ని తప్పించుకోలేకపోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement